రుగ్మతలపై చేద్దాం యుద్ధం
చట్టాల కంటే సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యమని.. అందువల్ల సామాజిక రుగ్మతలపై అందరం కలిసి యుద్ధం చేద్దామని జిల్లా కలెక్టర్ పాటూరి లక్ష్మీనరసింహం పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ప్రసంగిం చారు. జిల్లా ప్రగతిని వివరించారు. వరకట్నం, నిరక్షరాస్యత, మద్యపానం, లంచగొండితనం, అవినీ తి వంటి సామాజిక రుగ్మతలను పారదోలాలని పిలుపునిచ్చారు. అప్పుడే అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంపునకు యువత బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- శ్రీకాకుళం పాతబస్టాండ్
జిల్లాలో రూ.10 కోట్లుతో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు
ఫిబ్రవరి 13 నుంచి 24 వరకు జిల్లాలో ఆర్మి రిక్రూట్‌మెంటు ర్యాలీ నిర్వహిస్తారు.
గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు ఫిబ్రవరి 6.7 తేదీల్లో గిరిజన ఉత్సవాలు.
జిల్లా సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే వివరాలు ఫిబ్రవరి 3న వెల్లడికానున్నాయి. దాని ఆధారంగా తదుపరి చర్యలు.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాలి. దాన్ని బాధ్యతగా తీసుకుంటాం.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొందూరు ఖాదీలో నకిలీలను అరికట్టి, ఖాదీ కార్మికులను ప్రోత్సహిస్తాం. వారంలో ఒకరోజు అందరూ ఖాదీ వస్త్రాలు ధరించాలి.. నేను కూడా ధరిస్తాను.
వ్యవస్థల్లో అవినీతి రూపుమాపి, పొదుపు పాటించాలి.
ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగదారులకు రూ. 10కే ఎల్‌ఈడీ బల్బులు అందిస్తాం.
జిల్లాలో జన్మభూమి, స్వచ్ఛ భార త్, స్మార్ట్ గ్రామాల కార్యక్రమాలతోపాటు పారిశ్రామికాభివృద్ధికి పునాదులు వేస్తున్నాం.
బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా అందరికీ ప్రభుత ్వ విద్య అందిస్తాం.
రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
ధాన్యం కొనుగోలు, ఇసుక అమ్మకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమా అమలులో ముందున్నాం.
ప్రజలను చైతన్యవంతులను చేసి అందరి సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తాం.
రుణ వితరణ
కార్యక్రమంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు, మహిళలకు రూ.60.79 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3250 స్వయంశక్తి సంఘాలకు రూ. 51 కోట్ల లింకేజీ రుణాలు, ఉన్నతి కార్యక్రమం ద్వారా 504 మంది నిరుపేదలకు రూ.1.23 కోట్లు, 730 మందికి రూ.1.89 కోట్ల బీమా పరిహారం అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 199 మందికి రూ. 2.5 కోట్లు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 106 సంఘాలకు రూ. 8.86 లక్షలు, మరో ఇద్దరికి మూడు లక్షల వ్యక్తిగత రుణాలు అందజేశారు. వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా పది మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించడంతోపాటు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు కలెక్టర్ సాయుధదళాల పరేడ్ పరిశీలించి, గౌరవ వందనం తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్, మాజీ న్యాయమూర్తి పి.జగన్నాథం, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఏజేసీ పి.రజనీకాంతరావు, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ఎస్ వెంకటరావు, డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, డీఎంహెచ్‌వో శ్యామల, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.