మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని అటవీ శాఖ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికపై మంగళవారం మంచిర్యాల డివిజిన్ అటవీశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సారంగి సమీక్ష నిర్వహించారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ తిమ్మారెడ్డి, మంచిర్యాల డీఎఫ్‌వో ప్రభాకర్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో రవిప్రసాద్, ఎఫ్‌ఆర్వో అప్పయ్య, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో చేపట్టిన పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. అటవీ శాఖలో ఎలాంటి పనులు చేట్టాలన్నా ప్రతిపాదనలు పంపించి కేంద్రం అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి పనులు, నిధుల మంజూరు, వ్యయం, మొక్కల పెంపకం, అటవీ భూములు, సరిహద్దులు, భవనాలు, అటవీ సంరక్షణ పథకాల నిర్వహణ, పులుల సంరక్షణ, వర్షాపాతం వివరాలపై చర్చ జరిగినట్లు వివరించారు. అటవీ శాఖ అభివృద్ధి ప్రణాళికపై హైదరాబాద్‌లో ఉన్నతాధికారుల సమక్షంలో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అటవీ శాఖ అభివృద్ధిపై సమీక్ష
Published Wed, Jan 8 2014 6:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement