Timmareddy
-
రాష్ట్రానికి ‘భద్రాద్రి’ గుదిబండే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం గుదిబండగా మారిందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించడం, కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడమే దీనికి కారణమన్నారు. రూ.7,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, వాస్తవ వ్యయం రూ.10 వేల కోట్లు దాటిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు బుధవారం హాజరై తమ పిటిషన్లకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తికాక ముందే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమైందని, విద్యుత్ కొరత తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. విద్యుత్ కొరతను అధిగమించే సాకుతో టెండర్లు లేకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని తెలిపారు. 2017లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేనాటికే భూపాలపల్లిలో 800 మెగావాట్ల కేటీపీపీ, జైపూర్ (మంచిర్యాల జిల్లా)లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్‌తోపాటు జూరా లలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి కమిషన్‌కు వివరించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా విద్యుత్ లైన్ల కోసం రూ.630 కోట్లను చెల్లించారని తప్పుబట్టారు. యూనిట్‌కు రూ.3.90 ధరతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఒప్పందం చేసుకోగా, వాస్తవ ధర రూ.5.40కు పెరిగిందన్నారు. ఆ సమయంలో దేశంలో రూ.4.20కే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విద్యుత్ లభించిందని ఆధారాలను కమిషన్‌కు అందజేశారు. మూడేళ్ల తర్వాతే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వచ్చింది.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం 2014లో జరిగితే మూడేళ్ల తర్వాత 2017–18 నుంచి సరఫరా ప్రారంభమైందని, 1000 మెగావాట్లకు గాను 75 శాతమే వచ్చిందని వేణుగోపాల్‌రావు అన్నారు. విద్యుత్ బిల్లుల వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.10–20 వరకు అధిక ధరతో రాష్ట్రం విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయ్యేందుకు 1000 మెగావాట్ల పవర్ గ్రిడ్ లైన్లను బుక్ చేసుకోగా, పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోయినా రూ.650 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకొని రద్దు చేసుకోవడంతో రూ.261 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎలక్రి్టసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పవర్‌గ్రిడ్ దావా వేసిందని పేర్కొన్నారు. ఒప్పందం మేరకు రావాల్సిన విద్యుత్ రాకున్నా ఛత్తీస్‌గఢ్‌కు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. -
దొంగ ఓట్ల పాపం చంద్రబాబుదే
మడకశిర/హిందూపురం: రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం చంద్రబాబు దేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానిక మాజీ ఎమ్మెల్యే దివంగత వైసీ తిమ్మారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. వారి హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎంపీల బృందంతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మడకశిర ప్రాంతంలో వన్యప్రాణుల మృతిపై విచారణ చేయిస్తామని తెలిపారు. వన్యప్రాణుల మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం, హిందూపురమూ మనవే: పెద్దిరెడ్డి ‘కలసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పం మనదే. హిందూపురమూ మనదే...’ అని పెద్దిరెడ్డి అన్నారు. హిందూపురంలోని బైపాస్ రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. టీఎన్ దీపిక, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర, మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ పాల్గొన్నారు. -
అటవీ శాఖ అభివృద్ధిపై సమీక్ష
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని అటవీ శాఖ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికపై మంగళవారం మంచిర్యాల డివిజిన్ అటవీశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సారంగి సమీక్ష నిర్వహించారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ తిమ్మారెడ్డి, మంచిర్యాల డీఎఫ్‌వో ప్రభాకర్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో రవిప్రసాద్, ఎఫ్ఆర్వో అప్పయ్య, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో చేపట్టిన పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. అటవీ శాఖలో ఎలాంటి పనులు చేట్టాలన్నా ప్రతిపాదనలు పంపించి కేంద్రం అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి పనులు, నిధుల మంజూరు, వ్యయం, మొక్కల పెంపకం, అటవీ భూములు, సరిహద్దులు, భవనాలు, అటవీ సంరక్షణ పథకాల నిర్వహణ, పులుల సంరక్షణ, వర్షాపాతం వివరాలపై చర్చ జరిగినట్లు వివరించారు. అటవీ శాఖ అభివృద్ధి ప్రణాళికపై హైదరాబాద్‌లో ఉన్నతాధికారుల సమక్షంలో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
‘అటవీ’ రీ-ఆర్గనైజేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం అటవీశాఖలో రీ-ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పునర్విభజన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అంతరించి పోతున్న అడవులు, వన్యప్రాణులకు సంరక్షణ కరువైన నేపథ్యంలో అటవీశాఖను పటిష్టపరచాలని 2009లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ రీ-ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్ సింగ్ సుమారుగా ఏడాదిన్నరపాటు అధ్యయనం జరిపిన తర్వాత 2010 డిసెంబర్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్, డివిజన్, రేంజ్ కార్యాలయాల పెంపుతోపాటు అధికారులు, సిబ్బంది అవసరాలపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి పూర్తి వివరాలను సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్లు, అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆయన మార్పులు, చేర్పులను నివేదికలో సూచించారు. ఈ మేరకు ఆ నివేదికపై ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ తిమ్మారెడ్డి నిర్మల్‌లో ప్రకటించారు. ఈ నెల 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఎట్టకేలకు మోక్షం అటవీశాఖ రీ-ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్‌సింగ్ ఆరు మాసాలపాటు అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలో సమూల మార్పులు చేయాలని సూచించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పెంపకం, అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఆయన నివేదికలో మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఇకపై ఐఎఫ్ఎస్ కేడర్ కలిగిన అధికారులనే ఫారెస్టు కన్జర్వేటర్, డిప్యూటీ కన్జర్వేటర్, డీఎఫ్‌వోలుగా నియమించాలని సూచించారు. అటవీశాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం జరగనున్న నేపథ్యంలో డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అటవీ పరిధి తగ్గనున్నది. ప్రస్తుతం ఒక్కో డివిజన్లో 1,473 స్క్వేర్ కిలోమీటర్లు కాగా, 750 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గనుంది. అదే విధంగా ఒక్కో డివిజన్లో మూడు నుంచి నాలుగు రేంజ్‌లు, సెక్షన్ పెరుగుతుండటంతో బీట్ ఆఫీసర్ల పరిధి 25 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి 15 స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఒక్కటే సర్కిల్ ఉండగా, ఆదిలాబాద్, మంచిర్యాలలు రెండు జిల్లాలుగా విభజించనున్నారు. ఆరు డివిజ్లనను 11కు పెంచనుండగా, 26గా రేంజ్‌లు 41కి పెరగనున్నాయి. అటవీశాఖ గణాంకాల ప్రకారం 7,19,549 హెక్టార్ల విస్తరించి ఉన్న అడవులు... ఒక్కో డివిజన్లో ప్రస్తుతం 1,19,925 హెక్టార్లు ఉంది. మరో ఐదు డివిజన్లు పెరిగితే 11 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 65,414 హెక్టార్లు వస్తుంది. అలాగే 125గా ఉన్న సెక్షన్లు 170కి, 313 బీట్లు, 450కి పెరగనున్నాయి. అంతా సిద్ధం - తిమ్మారెడ్డి, చీఫ్ కన్జర్వేటర్, ఆదిలాబాద్ అటవీశాఖ రీ-ఆర్గనైజేషన్‌కు అంతా సిద్ధంగా ఉంది. రీ-ఆర్గనైజేషన్ కోసం ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదనలు తీసుకుంది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం పునర్విభజన జరిగితే ఫలితాలు బాగా ఉంటాయి. అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. అధికారికంగా ఉత్తర్వులు అందగానే జిల్లాలో రీ ఆర్గనైజేషన్ ప్రక్రియ మొదలవుతుంది. -
25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలా?
అదీ ఎక్కువ ధరకా..? ఈఆర్సీని ప్రశ్నించిన విద్యుత్‌రంగ నిపుణులు సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉండగా... అధిక ధర చెల్లించి ఏకంగా 25 ఏళ్లపాటు కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌రావు తదితరులు ప్రశ్నించారు. కేస్-1 బిడ్డింగ్ ద్వారా రానున్న 25 ఏళ్లపాటు 250 మెగావాట్ల విద్యుత్‌ను కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్ టెక్ నుంచి కొనుగోలు చేయడంపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) బుధవారం బహిరంగ విచారణ నిర్వహించింది. సింహాద్రి, హిందూజా తదితర విద్యుత్ ప్లాంట్ల నుంచి తక్కువ ధరకే దీర్ఘకాలంలో విద్యుత అందుబాటులో ఉండగా... యూనిట్‌ను ఏకంగా 15-16 రూపాయలు చెల్లించి థర్మల్ టెక్ నుంచి కొనుగోలు చేయవద్దని తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలపవద్దని ఈఆర్సీకి విన్నవించారు. ఈ విద్యుత్ కొనుగోలుపై పూర్తి సమాచారం ఇవ్వకుండా హడావుడిగా విచారణ నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అయితే విద్యుత్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో ప్రైవేట్ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేయవద్దనడం ఎంతవరకు సమంజసమని ఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ శేఖర్‌రెడ్డి, సభ్యుడు అశోకాచారిలు ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు చేయకపోతే కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. అయితే, కేస్-1 బిడ్డింగ్ ద్వారా విద్యుత్ కొనుగోలుపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియచేసేందుకు మరో మూడు రోజుల పాటు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత దీనిపై ఈఆర్సీ తుది ఆదేశాలు జారీచేయనుంది.