ఆర్‌ఎంపీ వైద్యుడి దుర్మరణం | RMP doctor died in TANUKU | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ వైద్యుడి దుర్మరణం

Published Mon, Dec 8 2014 12:27 AM | Last Updated on Thu, Aug 30 2018 6:04 PM

RMP doctor died in  TANUKU

తణుకు క్రైం :తణుకు మండలం దువ్వ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గాంధీ నగరంలో నివాసముంటున్న ఆర్‌ఎంపీ వైద్యు కుచ్చెర్లపాటి సత్యనారాయణరాజు (48) తాడేపల్లిగూడెంలోని స్నేహితుల ఇంటి గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు భార్య నాగమణితో కలిసి బైక్‌పై బయలుదేరాడు. దువ్వ వద్ద వెంకయ్యకాలువ ప్రాంతంలోకి వచ్చేసరికి దువ్వ సొసైటీ ఉపాధ్యక్షులు కోలపల్లి గోపాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన ధనరాజులు పొలం నుంచి బైక్‌పై దువ్వ గ్రామానికి వ్యతిరేక దిశలో వస్తుండగా రెండు వాహనాలు వేగంగా ఢీకొట్టుకున్నాయి.
 
 ఆర్‌ఎంపీ వైద్యుడు సత్యనారాయణరాజు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో గాయపడినృ గోపాలకృష్ణ, ధనరాజులను హైవే పెట్రోలిృగ్ వాహన సిబ్బంది ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. రూరల్ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సత్యనారాయణరాజుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరూ వివాహాలై  హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకుని వారు తణుకు బయలుదేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
 
 ‘ఎంతోమంది ప్రాణాలు నిలిపారు’
 ‘ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన మీకు ఈ రోజు ఈ దుస్థితా’ అంటూ సత్యనారాయణరాజు భౌతికకాయం వద్ద భార్య నాగమణి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆ వేళ ఈ వేళ అని లేకుండా పెద్ద పెద్ద వైద్యులకు దీటుగా వైద్యసేవలందించారంటూ విలపించారు. సత్యనారాయణరాజు మందిస్తే రోగం నయమైపోద్దనే అందరికీ నమ్మకమే.. అటువంటి నీకు మందిచ్చి.. నీ ప్రాణాలు నిలిపే వైద్యుడే లేకపోయాడా అంటూ గుండెలవిసేలా భార్య, కుటుంబసభ్యులు విలపించారు.
 
 గాంధీనగర్‌లో విషాదం
 అమలాపురం రూరల్ : పీఎంపీ, ఆర్‌ఎంపీల అసోసియేషన్ కోనసీమ కార్యదర్శి కేఎస్‌ఎన్.రాజు (55) ఆదివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా దుళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భార్య నాగమణితో కలిసి ఓ శుభకార్యానికి హాజరయ్యేం దుకు మోటార్ సైకిల్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు.  రాజు స్వగ్రామమైన అమలాపురం గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. శుభ కార్యక్రమానికి వెళ్లివస్తామని చెప్పిన రాజు మృత్యువాతపడడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. మరణవార్త తెలిసిన వెంటనే పీఎంపీల అసోసియేషన్ కోనసీమ అధ్యక్షుడు కంబాల బాబూరావు, మం డల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి రామ్మోహనరావు, కార్యదర్శి రెడ్డి వెంకటేశ్వరరావు, ప్రతినిధులు వీవీరావు, రఫీ, గుత్తుల శ్రీనివాసరావు, కర్రి శేషగిరితోపాటు పలువురు నాయకులు సంఘటన స్థలానికి వెళ్లారు. రాజు మృతికి పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement