ఆలయాల్లో దొంగల బీభత్సం
Published Fri, Dec 4 2015 10:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామంలోని ఆలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం అర్థరాత్రి ఊర్లోని ఐదు ఆలయాల్లో చోరికి పాల్పడ్డారు. ఆలయాల్లోని హుండీలు పగలగొట్టి సుమారు రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. శుక్రవారం ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement