
సాక్షి, కర్నూలు : కర్నూలు – వైఎస్సార్ కడప జాతీయ రహదారిలోని ఓర్వకల్ సమీపంలో ఉన్న రాక్ గార్డెన్స్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాక్‌గార్డెన్‌లో పురాతన కొండలు, సహజసిద్ధమైన గుట్టలతో పాటు రెండు కొండల మధ్య చెరువు ఉంది. శిల్ప చాతుర్యంతో మలిచినట్లు వివిధ ఆకృతుల్లో రాతివనాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం చల్లని గాలుల పలకరింపులు, పక్షుల కిలకిలరావాలతో ప్రశాంత వాతావరణం అగుపిస్తోంది. సినిమా షూటింగ్‌లకు ప్రత్యేకమైన స్పాట్‌గా మారింది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఇక్కడ పర్యాటకుల సందడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment