orvakal
-
ఏపీ: ఓర్వకల్లులో పైలట్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి: ఏపీలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఎయిరో అడ్వంచర్ స్పోర్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది, ఇది లాభదాయకమా కాదా? వంటి వివరాలతో పూర్తిస్థాయి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తున్నారు. ఏపీఏడీసీఎల్ పంపిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలించి ఈ నివేదికను తయారు చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పవనమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఈ ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. టీఎఫ్ఆర్ను తయారు చేయడానికి, కన్సల్టెన్సీ ఎంపిక చేయడానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఓర్వకల్లు వద్ద సహజసిద్ధంగా ఉన్న పలు ఆకృతులతో కూడిన కొండలు పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటాయని అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు వీఎన్ భరత్‌రెడ్డి తెలిపారు. -
బెంగళూరు నుంచి కర్నూల్ కు చేరుకున్న మొదటి విమానం
-
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి
-
న్యాయ రాజధానికి విమాన శోభ
తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా ఈ విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని నామకరణం చేస్తున్నాం. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆమోదంగా ఇటీవల జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారు. మీ కోసం మరింతగా పని చేస్తాం.రాష్ట్రంలో ఇప్పటివరకు తిరుపతి, కడప, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్‌లో విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక నుంచి కర్నూలులోని ఓర్వకల్లులో కూడా విమానాశ్రయం ప్రారంభమవుతోంది. మనందరం నిర్మించుకోబోతున్న ‘న్యాయ రాజధాని’ నుంచి ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను కలిపే ఎయిర్‌పోర్టుగా ఇది నిలబడుతుందని గర్వంగా చెబుతున్నా. కర్నూలు: ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’అని ప్రజల హర్షధ్వానాల మధ్య నామకరణం చేశారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడ నుంచి ఉదయం 11.45 గంటలకు ఓర్వకల్లు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని, జాతీయ జెండాను ఎగుర వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి టెర్మిల్ బిల్డింగ్ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికపై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు చరిత్రలో ఈ రోజు (గురువారం) ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. కారణమేంటంటే కర్నూలు నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండేవని, ఇక నుంచి విమానయానం ప్రారంభమవుతోందన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. బెంగళూరు, వైజాగ్, చెన్నైలకు సర్వీసులు నడుస్తాయని, ఇక్కడ ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రూ. 110 కోట్లతో విమానాశ్రయం పనులు ఎన్నికలకు కేవలం నెలరోజుల గడువు ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టు పూర్తికాక మునుపే, అనుమతులు రాకుండానే, విమానాలు ఎగరకుండానే, చివరకు కనీసం రన్‌వే కూడా పూర్తి స్థాయిలో పూర్తవ్వకుండానే అప్పటి ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేశారు. ఆయన పేరు చంద్రబాబునాయుడు. ఇది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో విమానాశ్రయం కచ్చితంగా రావాలనే పట్టుదలతో రూ.110 కోట్లు విలువైన పనులను కేవలం ఏడాదిన్నరలోపే పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, పోలీసు బ్యారెక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, బ్యారెక్, సబ్స్టేషన్లు, రన్వేలలో బ్యాలెన్సింగ్ పనులు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లతో పాటు ఇతరత్రా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. ఆస్ట్రియా నుంచి రెండు అధునాతన అగ్నిమాపక శకటాలు తెప్పించాం. కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), డీజీసీఏ అనుమతులు తెప్పించడం, విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలు పూర్తి చేయడంలో సంబంధిత మంత్రితో పాటు అందరూ శ్రమపడ్డారు. ‘ఉయ్యాలవాడ’ పేరుపై చిరంజీవి కృతజ్ఞతలు విమానాశ్రయానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’పేరు పెట్టడంపై ప్రముఖ సినీ హీరో చిరంజీవి ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశంలో తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషం’అని చిరంజీవి పేర్కొన్నారు. ఉయ్యాలవాడకు అసలైన నివాళి.. మనదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో పుట్టింది. 1915లో గాంధీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటగా బిహార్‌లోని చంపారన్‌లో సత్యాగ్రహం జరిగింది. వీటి కంటే ముందు, స్వాతంత్య్రానికి వందేళ్లు ముందే.. తొలి స్వాతంత్య్ర పోరాటం అని చరిత్రకారులు చెప్పిన 1857లో సిపాయిల తిరుగుబాటుకంటే ముందే 1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచి వచ్చారు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ కార్యక్రమానికి ముందు తపాలా శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయ పోస్టల్ స్టాంప్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో గ్రూపు ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం జగన్
-
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ఏపీ సీఎం వై ఎస్ జగన్
-
‘ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్దీప్సింగ్కు కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్, కేంద్రమంత్రితో కలిసి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతోందని సీఎం జగన్ తెలిపారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్ కటింగ్‌తో హడావుడి చేసిందని, రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్ తెలిపారు. అధునాతన అగ్నిమాపక కూడా అందుబాటులో ఉంటుందని, ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా.. బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. -
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ‘రాక్ గార్డెన్స్’
సాక్షి, కర్నూలు : కర్నూలు – వైఎస్సార్ కడప జాతీయ రహదారిలోని ఓర్వకల్ సమీపంలో ఉన్న రాక్ గార్డెన్స్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాక్‌గార్డెన్‌లో పురాతన కొండలు, సహజసిద్ధమైన గుట్టలతో పాటు రెండు కొండల మధ్య చెరువు ఉంది. శిల్ప చాతుర్యంతో మలిచినట్లు వివిధ ఆకృతుల్లో రాతివనాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం చల్లని గాలుల పలకరింపులు, పక్షుల కిలకిలరావాలతో ప్రశాంత వాతావరణం అగుపిస్తోంది. సినిమా షూటింగ్‌లకు ప్రత్యేకమైన స్పాట్‌గా మారింది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఇక్కడ పర్యాటకుల సందడి ఉంటుంది. -
ఓర్వకల్లులో వైఎస్ జగన్
-
రాబోయే 20 రోజుల్లో జరగబోయేది ఇదే : వైఎస్ జగన్
సాక్షి, ఓర్వకల్లు : ‘ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకూ రాష్ట్రంలో ప్రజల కష్టాలు స్వయంగా చూశాను. మీ బాధలు, సమస్యలు విన్నాను. పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ అందరి గుండె చప్పుడు విన్నా. నాలుగైదు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తా. మీ అందరికీ చెబుతున్నా... నేనున్నానే భరోసా ఇస్తున్నా.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు బహిరంగ సభలో ప్రసంగించారు. పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలు తిరిగాను. ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ల కష్టాలేంటనేది చూశాను. మీ మాటలు విన్నాను. నేనున్నాను అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో నాలుగైదు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తాం. ఏ గ్రామం తీసుకున్నా, సగటు మనిషి, కుటుంబం ఏం కోరుకుంటుందని, ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకూ వెతికాను. మనిషికి మనసు ఉంటే ఎదుటవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. ప్రభుత్వానికి మనసు ఉంటే...మనిషికే కాదు, ఇంటింటికీ మేలు చేయాలనుకుంటుంది. ఇటువంటి ప్రభుత్వం, పాలన....వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే అలాంటి పాలనతోనే వెళ్లిపోయింది. బాగుపడేందుకు ప్రభుత్వపరంగా మనం ఏం చేయాలి అనే పరిస్థితి ఈ అయిదేళ్లలో ఎక్కడా కనిపించలేదు. రైతన్న ఆవేదన, బాధను నేను చూశాను. మీ అందరికీ భరోసా ఇస్తూ ... నేను ఉన్నాను అని కచ్చితంగా చెబుతాన్నాను. ‘మన రాష్ట్రంలో 50 శాతం జనాభాలో మహిళలు ఉన్నారు. ఆ అక్కచెల్లెమ్మల పరిస్థితిని నా పాదయాత్రలో చూశాను. అప్పులు మాఫీ కాలేదన్న బాధ డ్వాక్రా మహిళల్లో చూశాను. నిజానికి వారు సంతోషంగా ఉంటే వారి కుటుంబాలు, గ్రామాలు.. చివరకు రాష్ట్రం బాగుంటుంది. పాదయాత్రలో వారి కష్టాలు చూశాను. వారి అప్పులు మాఫీ కాలేదు. వడ్డీలు పెరిగాయి. చివరకు సున్నా వడ్డీ రుణాల జాడే లేదు. వారి బాధలన్నీ నేను విన్నాను. అందుకే వారికి కూడా ‘నేనున్నాను’ అనే భరోసా ఇస్తున్నా. ఇక ఆడపిల్లలకు, మహిళలకు భద్రత ఉంటుందనుకుంటేనే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. కానీ నా పాదయాత్రలో గమనించా. గ్రామాల్లో మద్యం అమ్మే షాపులు విచ్చలవిడిగా కనిపించాయి. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నా మాట మరచిపోయారు. చీకటి పడితే రోడ్డు మీదకు వెళ్లాలంటే ఆడవాళ్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని నా కళ్లారా చూశాను. మీకు చెబుతున్నా... ఎలాంటి ఆందోళన వద్దు...నేను మీకు భరోసాగా, భద్రతగా ఉన్నానని చెబుతున్నా. పిల్లలు ఉన్నత చదువులకు కన్నవాళ్లు తమ ఆస్తులు అమ్ముకుంటున్నారు...ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పాదయాత్రలో చాలా చూశాను. ఉద్యోగాల కోసం ఆశగా చూస్తున్న యువతను చూశాను. ‘అన్నా రాష్ట్రం విడిపోయేటప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఎందుకన్నా ఉద్యోగాలు మాకు ఇవ్వడం లేదు. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు అయిపోయి ఉద్యోగాలు వెతుకుతున్న వారికి చెబుతున్నా...నేనున్నానని చెబుతున్నా. ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాకపోవడం చూశాను. ఒక మనిషి చనిపోతే కుటుంబం దెబ్బతినిపోవడం చూశాను. 108 అంబులెన్స్ సకాలంలో రాక ప్రాణాలు పోవడాన్ని చూశాను. ఆరోగ్యశ్రీ వర్తించక పూర్తిగా అస్వస్థత అయ్యి, కుర్చీకే పరిమితం అయ్యి, అప్పులపాలై, చావుకోసం ఎదురు చూస్తున్న పేదవాడి కుటుంబాన్ని చూశాను. మీ కష్టాలను చూశాను,... మీ బాధలు చూశాను మీ సందర్భంగా మీ అందరికీ నేనున్నాను అని చెబుతున్నా. బాబుగారి పాలనలో అవ్వా తాతల పెన్షన్లు పెరగవు. అదే ఎన్నికలు వచ్చేసరికి మూడు నెలల ముందు అవ్వా, తాతల పెన్షన్ పెరుగుతుంది. వికలాంగులు, ఒంటరి మహిళలు, అవ్వాతాతలను చూశాను. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ అడిగే ప్రశ్నలు విన్నా. మీరు ఏ పార్టీ వాళ్లు అని అడగడాన్ని చూశాను. పెన్షన్ ఇవ్వాలన్నా, కావాలన్నా పెన్షన్ ఇవ్వాల్సిందే. అలాంటి బాధితులకు నేను చెబుతున్నా...నేను ఉన్నాను. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినా...ప్రతి మనిషి గుండె చప్పుడులో ఎలా ఉన్నారో, అంతకన్నా గొప్ప పాలన ఇచ్చేందుకు నేను ఉన్నానని చెబుతున్నా. చంద్రబాబు అన్యాయపు పాలనతో ఆయన చేస్తున్న మోసాలు, అన్యాయాలు చూస్తున్నాం. ఎన్నికల్లో ఓట్లు అడిగితే... ప్రజలు వేయరని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి ప్రజల ఓట్లు తీసేస్తాడు, దొంగ ఓట్లు ఎక్కిస్తాడు. ప్రజల బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు చోరీ చేస్తారు. ఎన్నికల్లో గెలిసేందుకు బలమైన అభ్యర్థులను బలహీనపరిచేందుకు చివరకు హత్యా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని గజదొంగలా దోచేసుకుంటారు. అన్నీ చేసేసి...చివరకు ఆ పెద్దమనిషి దొంగే...దొంగ...దొంగ...దొంగ అని అరిచినట్లు ఉంది. మరో 20 రోజుల్లో ఇంకా అన్యాయమైనవి చాలానే చూస్తాం. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో అన్నింటితో పోరాటం చేస్తున్నాం. వీళ్లంతా 20 రోజుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. మీ అందర్ని కోరేది ఒక్కటే. చంద్రబాబు అన్యాయాలు ఇంతటితో ఆగిపోవు. ఆయన మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ గ్రామాల్లోకి వెళ్లి అందరికీ చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చేరూ.3 వేలు చూసి మోసపోవద్దు. మన పార్టీ అధికారంలోకి వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన పిల్లల్ని బడికి పంపిస్తే సంవత్సరానికి రూ.15వేలు ఇస్తాడని ప్రతి ఒక్కరికీ చెప్పాలి. ఇక మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి పరిస్థితి. ఇరవై రోజులు ఓపిక పడితే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు అన్నింటినీ అన్న భరిస్తాడు అని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పాలి. అలాగే రైతన్నకు చెప్పాల్సిన బాధ్యత మీదే. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు ప్రతి ఊరు, ఇల్లు, గడప గడపకూ తీసుకువెళ్లండి. పాణ్యం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పి.బ్రహ్మానందరెడ్డికి మీ ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
ఓర్వకల్లు చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఓర్వకల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాణ్యం నియోజకవర్గం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయన 2017 నవంబరు 14 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు మొత్తం 18 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. 14 నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నడక సాగించారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల శంఖారావం సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొదటి ఎన్నికల శంఖారావాన్ని పాణ్యం నియోజకవర్గంలో పూరించారు. -
మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేయూత
కల్లూరు(రూరల్): ఓర్వకల్లు సమీపంలో ఈ నెల ఏడున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న రాముడు, బెస్త రాముడుతో పాటు పంచలింగాలకు చెందిన డ్రైవర్ రాఘవేంద్ర కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వీరు కోడుమూరు నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ప్రకారం మొత్తం రూ.9 లక్షల నగదు అందించారు. ముందుగా ఆయన పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి నగరంలోని 33వ వార్డు శివరామకృష్ణనగర్లో నివాసం ఉంటున్న చిన్నరాముడు, బెస్త రాముడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. చిన్నరాముడు భార్య భార్గవికి రూ.3 లక్షలు, బెస్త రాముడు అక్క కాంతమ్మకు రూ.3 లక్షలు, డ్రైవర్ రాఘవేంద్ర కుమార్తెలు ఆదిలక్ష్మీ, నాగమణి, కుమారుడు ఛత్రపతికి రూ.3 లక్షలు, గాయపడిన పరుశురాముడుకు రూ.20 వేలు, లక్ష్మన్నకు రూ.20 వేల నగదు అందజేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న చిన్నరాముడు ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే చిన్నరాముడు ఇంటిని కూడా పూర్తి చేయిస్తామన్నారు. పిల్లల చదువుకు చేయూతనిస్తామన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కల్లూరు మండల కన్వీనర్ రెడ్డిగారి చంద్రకళాధర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రఘు, పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి తోఫిక్, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఫిరోజ్, 33, 36 వార్డు ఇన్‌చార్జ్‌లు షరీఫ్, నాగరాజు, పార్టీ నాయకులు పాణ్యం మహేశ్వర్‌రెడ్డి, కాటసాని శివనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉర్దూ వర్సిటీకి 144 ఎకరాల భూమి కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉర్దూ యూనివర్సిటీకి ఓర్వకల్‌లోని మార్కెట్ విలువపై భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్‌లోని 531–1, 556ఏ సర్వే నంబర్లలో 144 ఎకరాల భూములను కేటాయించింది. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేటాయించిన భూములను ఉన్నత విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఎయిర్‌పోర్టుకు భూములు సేకరించండి
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్ విమానాశ్రయానికి అవసరమైన భూముల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సంబందిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టర్ తన చాంబరులో సమీక్ష నిర్వహించారు. బోగాపురం ఇంటన్నేషనల్ విమానాశ్రయం సీఈఓ వీరేంద్ర సింగ్.. ఇటీవలే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు బొకే అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూముల సమీకరణపై సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయానికి 1000.10 ఎకరాల భూములు అవసరముండగా ఇప్పటి వరకు 638 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీకరించి ఇచ్చామని, అసైన్ల్యాండ్స్ 83 ఎకరాలు అప్పగించామని, వీటికి సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చినట్లు కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్ తెలిపారు. మిగిలిన భూములు ప్రయివేటు వ్యక్తుల నుంచి సమీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఓర్వకల్ తహసీల్దారు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉర్దూ వర్సిటీకి 144.34 ఎకరాల భూమి కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉర్దూ యూనివర్సిటీకి 144.34 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లు గ్రామంలోని 531, 556ఎ తదితర సర్వే నబర్లలోని ప్రభుత్వ భూములను వర్సిటికీ కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి జేసీ శర్మ.. జీవో ఆర్టీ నబరు 379ని జారీ చేశారు. ఈ భూములను హయ్యర్ ఎడ్యుకేషన్‌కు అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. -
విమానాశ్రయానికి నీటి కోసం అన్వేషణ
– ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో ఎయిర్‌ఫోర్సు అధికారుల చర్చలు కర్నూలు(అర్బన్): ఓర్వకల్లు సమీపంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే అంశంపై ఎయిర్‌ఫోర్సు అధికారులు అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఎయిర్‌ఫోర్సు అథారిటీ చీఫ్ జనరల్ మేనేజర్ వి. రవికుమార్ నేతృత్వంలో ప్రాజెక్టు ఇన్చార్జీతో పాటు నలుగురు ఇంజినీర్ల బృందం కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణతో సమావేశమయ్యారు. ఈవిమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో నీటి వనరుల గురించి చర్చించారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేసే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డబ్ల్యూఎస్ నుంచి నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని, ఇతర మార్గాలు ఏవైనా ఉంటే అన్వేశించాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసుకునే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఇందుకు రూ.8 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో కర్నూలు డీఈఈ మురళీ, ఓర్వకల్లు జేఈ కిరణ్ పాల్గొన్నారు. -
ఓర్వకల్లులో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి
– తెలుగు నిర్మాతల కౌన్సిల్ చైర్మన్ సత్యారెడ్డి – చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీ ఇప్పిస్తాం.. – కర్నూలు కేంద్రంగా సినిమా నిర్మాణం జరగాలి కర్నూలు(కల్చరల్): జిల్లాలోని ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో పలు సినిమాల నిర్మాణం జరుగుతోందని ఇక్కడ సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేస్తామని తెలుగు ప్రొడ్యూసర్స్ సెక్టర్ కౌన్సిల్ చైర్మన్ సత్యారెడ్డి తెలిపారు. స్థానిక రాఘవేంద్రనగర్‌లో ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బీవీ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన కాస్మోపాలిటన్ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో సినీ నిర్మాణానికి అనుకూలమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నారు. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న చాలా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. తెలుగు సినీ రంగ చరిత్రలోనే బ్లాక్ బ్లస్టర్గా పేరుతెచ్చుకున్న బాహుబలి చిత్రం షూటింగ్ కూడా కర్నూలులో ప్రారంభమైందన్నారు. తెలుగురాష్ట్రం రెండుగా విడిపోయినా సినిమా పరిశ్రమ మాత్రం కలిసికట్టుగా పని చేస్తుందన్నారు. లో బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీ ః తెలుగు సినీ రంగంలో లో బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే విధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని సత్యారెడ్డి తెలిపారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరముందన్నారు. కర్నూల్లో కాస్మోపాలిటన్ కల్చరల్ సెంటర్ ద్వారా చక్కని వినోదాన్ని కల్గిస్తున్న సినీనటుడు, నిర్మాత బీవీ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో బీవీ రెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య పాల్గొన్నారు. -
ఓర్వకల్లు మండలంలో ప్రకృతి వ్యవసాయం
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్లు మండలాన్ని మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకొస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ, ఓర్వకల్లు మండల ఐక్య సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతితో కలసి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్న దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలోనూ రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించనున్నట్లు తెలిపారు. -
హాహాకారాలు..ఆర్తనాదాలు!
- ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదం - లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - పదిమందికి తీవ్ర గాయాలు - లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ - అతికష్టం మీద బయటకు తీసిన స్థానికులు ఓర్వకల్లు : నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి.. మంగళవారం ఉదయం పదిగంటల సమయంలో శబ్దం..రక్షించండి అంటూ హాహాకారాలు..ఆర్తనాదాలు.. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు..గ్యాస్ కట్టర్ల సాయంతో క్షతగాత్రులను బయటకు తీశారు. కర్నూలు–చిత్తూరు 18వ నంబర్ జాతీయ రహదారిపై ఓర్వకల్లు వద్ద లారీని బస్సు ఢీకొన్న ఘటనలో పదిమంది గాయపడ్డారు. కడప డిపోకు చెందిన ఏపీ04 టీయు 5995 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు ఉదయం 6 గంటలకు కడప నుంచి కర్నూలుకు బయలుదేరింది. ఓర్వకల్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఫ్లై ఓవర్ వంతెనపై నిలబడిన ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన హెచ్ఆర్55 డబ్ల్యూ 2412 నంబర్ గల లారీని ఢీకొంది. దీంతో లారీ ముందు భాగం దెబ్బతిని లారీడ్రైవర్ బుచ్చిబాబు రెండు కాళ్లు స్టీరింగ్ కింద ఇరుక్కుపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ పెంచలయ్య, కండక్టర్ రామచంద్రారెడ్డితో పాటు ప్రయాణికులు రమేష్, రామకృష్ణ నాయక్, సంపత్‌కుమార్, శ్రీనివాసులు, విజయ్‌కుమార్, మహిమూన్, షహినాబి రక్తగాయాలకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు..స్థానికుల చేత లారీలో ఇరుక్కుకపోయిన డ్రైవర్‌ను గడ్డపారలు, గ్యాస్ కట్టర్లతో అతికష్టం మీద బయటకు తీశారు. డ్రైవర్ బుచ్చిబాబు గంటసేపు నరకయాతన అనుభవించాడు. ఈలోగా కర్నూలు తాలూకా సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు... రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఇష్టానుసారంగా రోడ్డు మలుపులు ఏర్పాటు చేస్తుండగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. -
జిల్లాలో 13 ఇండస్ట్రియల్ పార్కులు
– ఒక్కో పార్కుకు 50 నుంచి 100 ఎకరాల స్థల సేకరణ - ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 13 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని.. ఒక్కోదానిలో ఒక్కటి అంటే మొత్తం 14 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఓర్వకల్లు మండలంలో ఇండస్ట్రీయల్ హబ్‌ను ఏర్పాటు చేయనుండడంతో పాణ్యం నియోజకవర్గాన్ని మినహాయించామన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు 50 నుంచి 100 ఎకరాల చొప్పున భూమిని సేకరిస్తున్నామని వివరించారు. జిల్లా పరిశ్రమలశాఖ, మౌలిక వసతుల కల్పన శాఖలు సంయుక్తంగా రెవెన్యూ శాఖతో కలసి అవసరమై భూములను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, ఆదోని, బనగానపల్లె, ఆలూరు నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో భూముల గుర్తింపు కోసం కసరత్తు సాగుతోందన్నారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం కేటాయించిన భూముల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు.. యంత్రాలపై రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెడితే సూక్ష్మ పరిశ్రమగా, 5 కోట్ల వరకు పెట్టుబడి ఉంటే చిన్న పరిశ్రమగా, రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడి పెడితే మధ్య తరహా పరిశ్రమగా భావిస్తామని గోపీకృష్ణ తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటయితే..స్థానికంగానే నిరుద్యోగులకు ఉపాధి లభించడంతపాటు రెండెంకల అభివృద్ధిని సాధించేందుకు వీలవుతుందన్నారు. -
పరిశ్రమలకే దారేశారు!
- చెన్నై–బెంగుళూరు కారిడార్‌లో ఓర్వకల్‌కు చోటు - నోడ్ పాయింట్‌గా ఇండస్ట్రీయల్ హబ్‌కు గుర్తింపు - పరిశ్రమల రాకకు మరింత ఊతం - పెరగనున్న రోడ్డు రవాణా సదుపాయాలు - రైతుల భూముల విలువ పెరిగే అవకాశం కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): చెన్నై–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను నోడ్ పాయింట్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇది కరువు సీమలో పరిశ్రమల స్థాపనకు మరింతగా ఊతం ఇవ్వనున్నదని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేకిన్ ఇండియాలో భాగంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బెంగళూరు–చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. కారిడార్ వెంబడి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అనేక రాయితీలను కల్పిస్తున్నారు. పరిశ్రమలకు ముడి సరుకు తేవడానికి, ఉత్పత్తి అయిన మాల్‌ను తరలించడానికి చెన్నై–బెంగళూరును కలుపుతూ నాలుగు, ఆరు లేన్ల జాతీయ రహదారులను నిర్మిస్తారు. పరిశ్రమలకు అనుగుణంగా కొత్త రైల్వే మార్గాల నిర్మాణాలను చేపడుతారు. అంతేకాక కారిడార్ వెంబడి విద్యుత్, నీటి వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను చైన్నై–బెంగళూరు కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా గుర్తించారు. నోడ్ పాయింట్ అంటే.. ఆ కారిడార్‌లో భాగంగా పరిగణిస్తారు. పరిశ్రమల స్థాపనకు మరింత ఊతం: ఓర్వకల్‌ను మెగా ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓర్వకల్ సమీపంలో 7214 ఎకరాలను సేకరించింది. మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీకి అప్పగించింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీయల్ హబ్‌కు చెన్నై–బెంగళూరు కారిడార్‌లో చోటు లభించడంపై మంచి పరిణామమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. పరిశ్రమలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో సాధారణంగా రైతుల భూములకు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. -
విమానాశ్రయ ఏర్పాటుతో అభివృద్ధి
– ప్రజాభిప్రాయాన్ని సేకరించిన జేసీ హరికిరణ్ ఓర్వకల్లు : ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేయనున్న విమానాశ్రయంతో అభివృద్ధి జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బుధవారం కన్నమడకల గ్రామ శివారులో గల బుగ్గ దేవస్థానం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జేసీతో పాటు బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రఘుబాబు, కాలుష్య నియంత్రణ మండలి విస్తరణాధికారి ప్రసాదరావు, కన్నమడకల, పూడిచెర్ల, ఓర్వకల్లు సర్పంచులు నారాయణ, సరోజమ్మ, పెద్దయ్య ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. రాయలసీమ జిల్లాల సౌలభ్యం కోసం ఓర్వకల్లు ప్రాంతంలో జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు నెలకొల్పనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.200 కోట్ల అంచనాలతో 584 ఎకరాలలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని..తొలి దశలో రూ.88 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో 800 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. భూ బాధిత కుటుంబాలలో ఇంటికొక ఉద్యోగం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఓర్వకల్లు విమానాశ్రయ ప్రాంతంలో గల చెరువులను అభివృద్ధి చేసి సాగు నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. సమావేశంలో సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐలు చంద్రబాబునాయుడు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): సునయన ఆడిటోరియంలో ఓర్వకల్లు మండలం శకునాల, గడివేముల మండలం గని రైతుల భూములకు నష్ట పరిహారాన్ని చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్ పంపిణీ చేశారు. శకునాల గ్రామంలో 1100 ఎకరాలకు గాను 300 ఎకరాలకు ఇప్పటికే పరిహారం పంపిణీ చేశామన్నారు. మిగిలిన రైతుల్లో 500 ఎకరాలకు 278 మంది రైతులకు రూ.21 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గని గ్రామంలో 750 ఎకరాలకు గాను 300 ఎకరాలకు గతంలోనే పరిహారం ఇచ్చామని, ప్రస్తుతం 300 ఎకరాలకు 176 మంది రైతులకు రూ.13.50 కోట్లు పరిహారం చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఓర్వకల్లులో త్వరలో విమానాశ్రయం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ఏపీ సోలార్ కార్పోరేషన్ చీఫ్ విఎస్ఆర్ నాయుడు, ఎస్ఇ నారాయణమూర్తి, కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొదుపులో ఓర్వకల్లు మహిళలు ఆదర్శం
– రూ.15వేల కోట్లతో రైతుమిత్ర గ్రూపుల ఏర్పాటు – ఓర్వకల్లు మహిళలకు బాధ్యతలు – మొక్కజొన్న పంటకు ఫసల్ బీమా వర్తింపు – వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓర్వకల్లు: పొదుపు సంఘాల ద్వారా ఓర్వకల్లు మహిళలు సాధించిన ఆర్థిక స్వాలంబన ఆదర్శనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓర్వకల్లులో పొదుపు ఉద్యమాన్ని స్థాపించి 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలకు మంత్రితో పాటు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయకుమార్, కమిషనర్ ధనుంజయరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మహిళా సాధికార సమన్వయకర్త విజయభారతి నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ..రైతులను నష్టాల బారినుంచి తప్పించేందుకు రూ.15 వేల కోట్లతో మిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి విడతగా రాష్ట్రంలో 131 క్లస్టర్లలో 2లక్షల మంది రైతులతో 20వేల సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఓర్వకల్లు పొదుపు సమాఖ్య మహిళలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకతి వ్యవసాయంపై ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ ఏడాది రబీ సీజన్‌కు సంబంధించి 98వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఉల్లి ధర పతనమైన తరుణంలోకిలో రూ.7 నుంచి రూ.8 చొప్పున కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని మొక్కజొన్న పంటకు కూడా వర్తింపజేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఓర్వకల్లు రైతాంగానికి సాగునీరు అందించే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. శనగ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు ఓర్వకల్లు ప్రాంతంలో ప్రభుత్వ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలో ఐదేళ్లకు పైబడి ఎలాంటి బకాయిలు లేని మహిళా సంఘాలకు పొదుపు ద్వారా వచ్చిన రూ.కోటి రివాల్వింగ్ ఫండ్‌ను(ఒక్కొక్క సంఘానికి రూ.50 వేల చొప్పున )చెక్కు రూపేణ అందజేశారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కేడీసీసీ బ్యాంకు చైర్మెన్ మల్లికార్జున రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, పాణ్యం, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఏరాసుప్రతాపరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, వీరభద్రగౌడ్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, ఆర్డీఓ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
ఓర్వకల్ (కర్నూలు) : ద్విచక్రవాహనం పై నుంచి పడి ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువబుగ్గ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవానందం హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బైక్ పై వెళ్తుండగా.. గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.