ఓర్వకల్లు మండలాన్ని మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకొస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు.
ఓర్వకల్లు మండలంలో ప్రకృతి వ్యవసాయం
Feb 17 2017 12:20 AM | Updated on Jun 4 2019 5:04 PM
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్లు మండలాన్ని మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకొస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ, ఓర్వకల్లు మండల ఐక్య సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతితో కలసి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్న దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలోనూ రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement