యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో ఆమె పాల్గొన్నారు.అనంతరం ఆమె ప్రసంగించారు.సమైక్యాంధ్రపై తన వైఖరిని స్పష్టం చేయకుండా చంద్రబాబుకు సీమాంధ్రలో తిరిగే హక్కు లేదని ఆమె పేర్కొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతు తెలపకుంటే బాబును సీమాంధ్రలో తిరగనివ్వమని వైఎస్ఆర్ సీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలది ఒకే సిద్దాంతమని ఆ పార్టీ నేత అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఓట్లు.. సీట్లు కోసమే ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజనకు పూనుకున్నాయని ఆయన ఆరోపించారు.