పంట రుణాల లక్ష్యం రూ.2372.39 కోట్లు
- ఖరీఫ్‌లో రూ.1803 కోట్లు
- రబీలో రూ. 569.39 కోట్లు
- దీర్ఘకాలిక రుణాలు రూ.281.75 కోట్లు
కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది పంట రుణాలను రైతులకు భారీగా అందించాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఖరీఫ్‌లో రూ. 1803 కోట్లు , రబీలో రూ. 569.39 కోట్లు పంపిణీ చేసి సాగుకు సహకరించాలని నిర్ణయించినట్లు జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజరు లేవాకు రఘునాధరెడ్డి తెలిపారు.2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఖరీఫ్‌లో పంటరుణాల లక్ష్యం రూ.1803 కోట్లు కాగా, రబీలో రూ. 569.39 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
ఇందులో దీర్ఘకాలిక పంట రుణాలు రూ. 281.75 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 314.66 కోట్లు ఇవ్వాలని ప్రణాళికలో పొందపరచామన్నారు. అలాగే మైనర్ ఇరిగేషన్‌కు రూ. 455.53కోట్ల్లు, భూ అభివృద్ధికి రూ. 6.26 కోట్లు, యాంత్రీకరణకు రూ. 216.09 కోట్లు, పండ్ల తోటల సాగుకు రూ.13.87 కోట్లు ఇస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ వరకు ఉంటుందని అప్పటి వరకు రుణాలు ఇస్తుంటామన్నారు. రబీకి సంబంధించి మార్చినెలాఖరు వరకు గడువు ఉంటుందన్నారు.