విజయనగరం మున్సిపాలిటీ: అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఇది తీపి కబురు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్ధిక సంఘం కింద రూ24 కోట్ల 94 లక్షల 37వేలను ఈనెల 1వ తేదీన విడుదల చేసింది. 2015-16 ఆర్థిక సం వత్సరంలో తొలి విడతగా కింద ఈ నిధులు మంజూరైనట్లు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తెలిపా రు. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలుండగా... ఆ యా పంచాయతీల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఈ నిధు లు కేటాయించనున్నారు.
జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా మండల ట్రెజరీలకు సోమవారం జమ చేశారు. జమ చేసిన నిధులు నాలుగు, ఐదు రోజుల్లో పంచాయతీల ఖాతాల్లో పడనున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉండగా.. 14వ ఆర్ధిక సంఘం కింద కేటాయించిన రూ 24.94 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు వినియోగించేందుకు అనుమతిచ్చింది.
ఈ నిధులను సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విధీ దీపాలకు వినియోగిం చే విద్యుత్‌బిల్లులు చెల్లింపులకు వినియోగించవచ్చు. రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. గత ఏడాది జిల్లాలోని 203 గ్రామ పంచాయతీ క్లస్టర్‌లకు కేటాయించిన కంప్యూటర్‌లకు వినియోగించే ఇంటర్నెట్‌ల బిల్లుల చెల్లింపులు చేసుకోవచ్చు.
పంచాయతీలకు రూ.24.94 కోట్లు
Published Tue, Aug 4 2015 3:41 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement
Advertisement