రూ.32.81 కోట్ల పంట నష్టం | Rs .32.81 crore crop damage | Sakshi
Sakshi News home page

రూ.32.81 కోట్ల పంట నష్టం

Published Wed, Jan 28 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

రూ.32.81 కోట్ల పంట నష్టం

రూ.32.81 కోట్ల పంట నష్టం

కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. కరువు పరిస్థితులపై రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కరువు పరిస్థితులపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం డిసెంబరు నెల15వ తేదీ రాత్రి జిల్లాలో 48 మండలాలను కరువు బారిన పడినట్లు ప్రకటించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కరువులో దెబ్బతిన్న పంటల తుది జాబితా తయారీకి సిద్ధమైంది.

డిసెంబరు నెల 23 నుంచి 31వ తేదీ వరకు నివేదిక తయారు చేసేందుకు ఏఓ, ఏఇఓలు, గ్రామ రెవిన్యూ అధికారుల బృందాలు పంటలను సందర్శించి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ ఇన్‌చార్జ్ జేడీ సంబందింత అధికారులను ఆదేశించారు. దీంతో యంత్రాంగం క్షేత్రస్థాయిలో 20 మండలాల్లో ఎలాంటి నష్టంలేదని, మిగతా 28 మండలాల్లో తొమ్మిది రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంగళవారం క్షేత్రస్థాయి యంత్రాంగం తుది జాబితాను జిల్లా వ్యవసాయశాఖ ఇన్‌చార్జ్ జేడీకి సమర్పించింది.

ఆ నివేదికను కలెక్టర్‌కు ఇన్‌చార్జ్ జేడీ సమర్పించారు. జిల్లాలోని 28 మండలాల్లో అత్యధికంగా పంట నష్టాలు జరిగాయని అంచనాలు వేశారు. గతంలోనే రైతులు ఆయా పంటలకు సంబందించి ఫోటోలను తయారు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఆ విధంగా రైతులు తీసుకున్న పంటల ఫోటోలను అధికారులకు సమర్పించారు.

ఆ ఫోటోల ఆధారంగా అలాగే గ్రామ రెవిన్యూ అధికారులు ముందుగనే రైతులు సాగు చేసిన పంటలను అడంగళ్‌లో రాసి ఉన్నారు. ఆయా పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో రెవిన్యూ కార్యాలయాల్లో  బృందాలు పరిశీలించి నివేదికలు తయారు చేశాయి.
 
 
 పంటలు            విస్తీర్ణం        పంట నష్టం        బాధిత
                    (హెక్టార్లలో)    (రూ.లలో)             రైతులు
 వరి                471.282        47,12,820        1074
 వేరుశనగ        13273.026      13,27,30,760        9854
 కంది            132.712             8,29,450          309
 పత్తి            18619.623       18,61,96,230          18971
 నువ్వులు            118.212             5,91,060           167
 జొన్న              22.86           1,14,300             28
 ఉలవలు            283.78         17,73,625           540
 సజ్జ              243.116         12,15,580           404
 చెరకు              1.8                    8,000             02
 మొత్తం        33165.461        32,81,71,825        41349

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement