
ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకల నిర్వహణకోసం రూ.5 కోట్లు కేటాయించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.
గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆయన వివిధ రంగాల్లో తన ప్రాభవాన్ని చాటుతోన్న 35 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ ఏడాది తెలుగు-వెలుగు పురస్కారాన్ని బాలాంతరపు రజినీకాంతరావుకు అందజేస్తున్నట్లు తెలిపారు.