మంత్రి రాకతో వైఎస్సార్‌సీపీ నాయకుల ఆందోళన | ysrcp activists fires of minister came | Sakshi
Sakshi News home page

మంత్రి రాకతో వైఎస్సార్‌సీపీ నాయకుల ఆందోళన

Published Fri, Mar 10 2017 12:00 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

ysrcp activists fires of minister came

ఓడీ చెరువు : మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం సాయంత్రం ఓడీచెరువు పోలింగ్‌ కేంద్రం సమీపంలోకి రావడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వెంటనే ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది అప్రమత్తమై మంత్రి పల్లెను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన సమీపంలోని టీడీపీ నాయకుని ఇంట్లోకి వెళ్లారు. పది నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

పోలీసులు మొదట వారిని, తర్వాత మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. ఆందోళనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటరంగారెడ్డి, నాయకులు ఎద్దుల రామసుబ్బారెడ్డి, వెల్డింగ్‌ బాషా, కొత్తపల్లి బాషా, సలీం, జయరాంరెడ్డి, ఆంజనేయులు, వెంకటనారాయణ, ముబారక్, ఆదిశేఖర్, సూర్యనారాయణరెడ్డి, చౌటకిష్ట, మునెప్ప, అలీఖాన్, సురేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement