తమ్ముళ్లు బాహాబాహీ | tdp leaders fight in obuladevara cheruvu | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లు బాహాబాహీ

Published Thu, May 25 2017 11:13 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

tdp leaders fight in obuladevara cheruvu

- మాజీ మంత్రి ఎదుటే ఘటన
- ఓబుళదేవరచెరువులో ఉద్రిక్తత
- అక్కడి నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి పల్లె


ఓబుళదేవరచెరువు (పుట్టపర్తి) : ఓబుళదేవరచెరువులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలలో సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల పంపిణీ కేంద్రం వద్ద గురువారం సాయంత్రం మాజీ మంత్రి, పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి ఎదుటే టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తమ్ముళ్ల మధ్య రెండు వర్గాలు గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. రెండు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే...
మండలంలోని ఎం.కొత్తపల్లికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు, మామిళ్లకుంట్లపల్లికి చెందిన మరికొందరు కార్యకర్తల మధ్య  గొడవ జరిగి కొట్టుకొనేందుకు సిద్ధపడ్డారు. మామిళ్లకుంట్లపల్లికి చెందిన సీనియర్‌ మేట్‌ను తొలగించి టీడీపీకి చెందిన వ్యక్తిని నియమించాలని ఎం.కొత్తపల్లికి చెందిన టీడీపీ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డిని కోరారు. ఇది గమనించిన అదే పార్టీలోని మరో వర్గానికి చెందిన వారు మాజీ మంత్రి వద్దకు చేరారు. రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రెండు వర్గాలకు ఎమ్మెల్యే సర్దిచెప్పలేక \అక్కడి నుంచి అమడగూరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య గొడవ మరింత రాజుకుంది. ఓ దశలో వారు కొట్టుకొనేందుకు తలపడ్డారు. అక్కడే ఉన్న ఎంపీపీ ఇస్మాయిల్, టీడీపీ నాయకులు అల్లాబకష్, శ్రీరాములు నాయుడు, జయచంద్ర జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలను పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఓ దశలో రెండు వర్గాల మధ్య పరిస్థితి అదుపు తప్పే క్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరకొట్టారు. అనంతరం రెండు వర్గాల ఫిర్యాదులును స్వీకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement