హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ దాడులు రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 47 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, రంగారెడ్డి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముమ్మరంగా ఈ తనిఖీలు చేపట్టారు.
ప్రధానంగా జాతీయ రహదారిపై వెళ్లే బస్సులను ఆపి ఫిట్‌నెస్ పరిశీలించారు. డ్రైవర్ల ఫిట్‌నెస్‌ను కూడా తనిఖీ చేశారు. కొన్ని బస్సులు పర్మిట్ కూడా లేకుండా తిరుగుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. గుంటూరులో కంకరగుంట, బస్టాండ్ వద్ద తనిఖీలు జరిపిన అధికారులు పది బస్సులను జప్తు చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఓ బస్సును సీజ్ చేశారు. కర్నూలులో నాలుగు, జహీరాబాద్లోనూ నాలుగు బస్సులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
రవాణా శాఖ తనిఖీలు, 47 బస్సులు జప్తు
Published Fri, Nov 1 2013 8:25 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement