ఆర్టీసీ విభజన రెండు నెలల్లో పూర్తవుతుందని, 12 రీజియన్లతో ఆంధ్రా ఏపీ ఆర్టీసీ ఏర్పడనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు.
ఏపీ రవాణా మంత్రి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజన రెండు నెలల్లో పూర్తవుతుందని, 12 రీజియన్లతో ఆంధ్రా ఏపీ ఆర్టీసీ ఏర్పడనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పాత బస్సుల మరమ్మతుల వల్లే ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాటి స్థానంలో కొత్త బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద త్వరలో రాష్ట్రానికి 1,500 బస్సులు రానున్నాయని తెలిపారు. కేంద్ర రవాణా శాఖ నుంచి ఈ ఏడాది 500 కి.మీ. రాష్ట్ర రహదారులకు జాతీయ గుర్తింపు లభించిందన్నారు.