నేడు ఆదిలాబాద్ జిల్లాకు రుద్రమదేవి | rudrama devi movie shooting in adilabad district from today | Sakshi
Sakshi News home page

నేడు ఆదిలాబాద్ జిల్లాకు రుద్రమదేవి

Published Tue, Nov 26 2013 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

rudrama devi movie shooting in adilabad district from today

 కుంటాల(నేరడిగొండ), న్యూస్‌లైన్ :
 రాష్ట్రంలోనే పేరుగాంచిన కుంటాల జలపాతం వద్ద మంగళవారం ప్రతిష్టాత్మక చిత్రం రుద్రమదేవి షూటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు గాను భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ సెట్టింగులను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా అనుష్క, రానా నటిస్తున్నారు. మంగళవారం నాటి షూటింగ్‌లో వారు పాల్గొననున్నారు. దర్శకుడు గుణశేఖర్ కాగా, సహ నిర్మాత రాంగోపాల్. ఇదిలా ఉండగా.. జలపాతం చెంతన చిత్రానికి సంబంధించి వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇక్కడ వెయ్యి స్తంభాల గుడితో పాటు పలు సెట్టింగులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తొలి రోజు మంగళవారం షూటింగ్ ప్రారంభం కానుంది. ఒక పాట, కొన్ని సీన్లు ఇక్కడ చిత్రీకరించనున్నామని, షూటింగ్ వారం రోజులు లేదా 15 రోజుల పాటు సాగే అవకాశాలున్నాయని చిత్రం మేనేజర్ బాలరాజు సోమవారం తెలిపారు. కాగా, అనుష్క, రానా వస్తున్నట్లు ప్రచారం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వారిని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement