anuskha
-
అనుష్క నంబర్ అనుకుని వందల సార్లు..: డైరెక్టర్
'అంటే సుందరానికీ' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. చాలా విభిన్న కథలతో సినీ అభిమానులను అలరించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెగెటివిటీ విస్తరించిందన్నారు. కొంతమంది నెటిజన్లు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని ఆత్రేయ చెప్పారు. సెలబ్రిటీలు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటేనే ఇలాంటివి తగ్గుతాయని తెలిపారు. కొవిడ్ సమయంలో ఎదురైన సంఘటను దర్శకుడు వెల్లడించారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. 'కొవిడ్ సమయంలో నా స్నేహితుడి ఫాదర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు రక్తం అవసరం కావడంతో బ్లడ్ రక్తదాత కోసం చాల వెతికాం. నా ఫోన్ నంబర్ని జత చేస్తూ అందరికీ మేసేజెస్ పంపా. ఈ విషయం తెలుసుకున్న నటి అనుష్క మాకు సాయం చేయడం కోసం ఆ సందేశాన్ని తన సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోన్ నంబర్ అనుష్కదే అనుకుని అందరూ పొరబడ్డారు. చాలామంది కాల్స్ కూడా చేశారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నా ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఎవరూ ఊహించి ఉండరు. ఒకరు వీడియో కాల్ చేస్తే.. మరొకరు షర్ట్ లేకుండా ఫొటోలు పంపారు. ఇక ఆ దారుణాలను నేను చెప్పలేను. హీరోయిన్ల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా అని షాక్‌కు గురయ్యా. ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్ బ్లాక్ చేశా.' అని అన్నారు. అంటే సుందరానికీ చిత్రానికి వచ్చిన స్పందనపై ఆయన మాట్లాడారు. ఆ చిత్రానికి వచ్చిన ఫలితంపై పూర్తి బాధ్యత నాదేనని చెప్పారు. ఆ సినిమా కొంతమంది నచ్చగా.. మరికొందరు నిడివి ఎక్కువ ఉందని కామెంట్స్ చేశారు. సినిమా నిడివి పది నిమిషాలు ఎక్కువైందని తెలుసు.. కానీ ఎడిట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే ఒక సీన్‌కు మరో సీన్‌కు లింక్ ఉంది. అయితే సినిమాకు ఎక్కువగా దగ్గర కాకూడదని ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నా. ఎందుకంటే అంటే సుందరానికీ ఫలితం నన్ను తీవ్రంగా బాధించింది.' అని అన్నారు. -
హీరోయిన్ అనుష్క మూగబాసలు
ముద్దబంతి పువ్వులో మూగ బాసలు అని పాటలో విన్నాం. ఇక హీరోయిన్ అనుష్క మూగబాసలు చూడబోతున్నాం. అవును అనుష్కను వెండితెరపై చూసి ఏడాది పైనే అవుతోంది. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అవుతుంది. భాగమతి తరువాత ఏ చిత్రంలోనూ నటించని ఆ స్వీటీ పెరిగిన తన బరువును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడిందనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. అంతే కాదు ఆ మధ్య ఆలయ దర్శనం చేసుకుంటే, అనుష్క దోశ నివారణ పూజలు నిర్వహించిందని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందనిలాంటి నిరాధార వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోని ఈ బ్యూటీ ఆ మధ్య బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రయత్నం ఫలించి నాజూగ్గా రెట్టించిన అందాన్ని పోగేసుకుని తిరిగొచ్చింది. తాజాగా సైలెన్స్ అనే త్రిభాషా చితంలో నటించడానికి సిద్ధమైంది. మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు రానా అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఇందులో నటి అనుష్క మూగ, చెవుడు కలిగిన యువతిగా నటించబోతోందట. ఇందుకుగానూ ఈ అమ్మడు మూగ భాషలో శిక్షణ పొందుతోంది. అమెరికాలో మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని సమాచారం.అసలు మాటలే లేకుండా తన సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్ చిత్రం ద్వారా అలరించడానికి ఈ బ్యూటీ తయారవుతోందన్నమాట. -
’భాగమతి’ ట్రైలర్ విడుదల
-
అభిమానులకు ‘స్వీటీ’ గిఫ్ట్
అరుంధతిలో జేజేమ్మగా, బాహుబలి చిత్రంలో దేవసేనగా తన నటనతో అందరి అనుష్క... తాజాగా భాగమతి ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. స్వీటీ (మంగళవారం) పుట్టినరోజు సందర్భంగా ...భాగమతి ఫస్ట్‌లుక్‌ను ‘షీ ఈజ్ కమింగ్’ అంటూ చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ‘జట్టు విరబోసుకుని....చేతిలో రక్తమోడుతున్న సుత్తితో’ కనిపిస్తున్న అనుష్కకు అప్పుడే ప్రశంసలు కురుస్తున్నాయి. హీరో రాణా దగ్గుబాటి ..అవుసమ్’ అంటూ భాగమతి ఫస్ట్‌లుక్ ను ట్విట్ చేశాడు. కాగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక బాహుబలి -2 చిత్రం తరువాత అనుష్కను మళ్లీ తెరపై చూడలేదు. ఆమె తర్వాత చిత్రం కోసం అభిమానులు తహతహలాడుతున్నారనే చెప్పాలి. భాగమతి చిత్రాన్ని ముందు డిసెంబరు నెలలో విడుదల చేయాలనుకున్నా, తాజాగా జనవరిలో విడుదల చేయనున్నట్లు . అయితే ఆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి ఆమె అభిమానులకు గిఫ్ట్‌గా అందించారు. She is coming! Presenting #BhaagamathieFL starring #Anushka#Bhaagamathie #HBDAnushkaShetty pic.twitter.com/mlL94ohN4m — UV Creations (@UV_Creations) 6 November 2017 -
'లింగా' ఆడియో సక్సెస్ మీట్
-
నేడు ఆదిలాబాద్ జిల్లాకు రుద్రమదేవి
కుంటాల(నేరడిగొండ), న్యూస్‌లైన్ : రాష్ట్రంలోనే పేరుగాంచిన కుంటాల జలపాతం వద్ద మంగళవారం ప్రతిష్టాత్మక చిత్రం రుద్రమదేవి షూటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు గాను భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ సెట్టింగులను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా అనుష్క, రానా నటిస్తున్నారు. మంగళవారం నాటి షూటింగ్లో వారు పాల్గొననున్నారు. దర్శకుడు గుణశేఖర్ కాగా, సహ నిర్మాత రాంగోపాల్. ఇదిలా ఉండగా.. జలపాతం చెంతన చిత్రానికి సంబంధించి వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇక్కడ వెయ్యి స్తంభాల గుడితో పాటు పలు సెట్టింగులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తొలి రోజు మంగళవారం షూటింగ్ ప్రారంభం కానుంది. ఒక పాట, కొన్ని సీన్లు ఇక్కడ చిత్రీకరించనున్నామని, షూటింగ్ వారం రోజులు లేదా 15 రోజుల పాటు సాగే అవకాశాలున్నాయని చిత్రం మేనేజర్ బాలరాజు సోమవారం తెలిపారు. కాగా, అనుష్క, రానా వస్తున్నట్లు ప్రచారం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వారిని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. -
అదే టెన్షన్ వీళ్లల్లో చూస్తున్నాను - అనుష్క
‘‘నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందులోనూ మెలొడీస్ అంటే చెవి కోసుకుంటాను. ఈ సినిమా పాటలు విన్నాను. శ్రవణ్ మంచి పాటలిచ్చాడు. ఆడియో బాగున్నట్లే, సినిమా కూడా బాగుంటుందని నా నమ్మకం’’ అని అనుష్క అన్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో హర్షవర్దన్ రాణే, వితిక శేరు, విష్ణువర్దన్, రీతువర్మ, హరీష్, శ్రీముఖి ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. పవన్ సాదినేని దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనుష్క ఇంకా మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ‘సూపర్’లో నటిస్తున్నప్పుడు నేనెంత టెన్షన్ పడ్డానో, అదే టెన్షన్ ఈ టీమ్ కళ్లల్లో చూస్తున్నాను. పాటలు, ప్రచార చిత్రాలు చూశాక ఈ సినిమాకోసం వీరెంత ఎఫర్ట్స్ పెట్టారో అర్థమవుతోంది. నిర్మాత వేణుగోపాల్ నాకు ఆరేళ్లుగా తెలుసు. నేను అన్నయ్య అని పిలుస్తాను. రొటీన్ చిత్రాలు కాకుండా మంచి సినిమాలు తీయాలని తపన పడే వ్యక్తి ఆయన. ఈ సినిమా ఆయన అభిరుచికి తగ్గట్టు ఉంటుందనుకుంటున్నా’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు ఎంవీకె రెడ్డి, గుత్తా జ్వాల, మధుర శ్రీధర్, అతిథి చంగప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.