వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్‌లోని రాణిరుద్రమదేవి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రుద్రమదేవి పోస్టల్ స్టాంప్‌ను మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పార్టీ నగ ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రకటిం చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమానికి వి.ప్రకాష్, హైమావతి, శాస్త్రి, పాండురావు తదితరులు హాజరవుతారని చెప్పారు.
కాకతీయ ఉత్సవాలపై నిర్లక్ష్యం: వినయ్
కాకతీయ ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. ఘన కీర్తి కలిగిన కాకతీయ సామ్రాజ్య గొప్పతనాన్ని మరుగుపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీ రుకు నిరసనగా తమ పార్టీ, తెలంగాణవాదుల సహకారం తో పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు ముందే ప్రభుత్వ తీరును తాము అనుమానించామ ని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలకు రూ.300కోట్లు కేటాయిస్తే.. కాకతీయ ఉత్సవాలకు రూ.100కోట్లు ఇవ్వాలన్నా అత్తెసరు నిధులు కేటాయించారన్నారు. గొలుసుకట్టు చెరువులు, కాకతీయుల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయాలని చెప్పినా స్పందన లేదని ఆయన విమర్శించారు.
నేడు రుద్రమదేవి పోస్టల్ స్టాంప్ విడుదల
Published Tue, Nov 26 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement