కర్నూలు (ఓల్డ్ సిటీ) : జిల్లా వ్యాప్తంగా తొలగింపునకు గురైన గ్రామీణ తపాల ఉద్యోగులు మంగళవారం కర్నూలు పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 ల మంది పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తపాలా శాఖ అడిషినల్ డెరైక్టర్ హరికృష్ణ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వీరికి తపాలా శాఖ రెగ్యులర్ ఉద్యోగులు కూడా మద్దతు పలికారు.