కర్నూలు (న్యూసిటీ) : రాష్ట్రంలో విదేశీ వర్సిటీలకు అనుమతులు జారీ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా కేంద్రంలో పలువురు విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో విదేశీ వర్సిటీలకు అనుమతులు మంజూరు చేయాలని ఇటీవల ఏపీ కెబినేట్ తీర్మానించిన విషయం తెలిసిందే. దీనిని పలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.