శ్రీశైలం : శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. వరుస సెలవులతో పాటు, వారాంతం కావటంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.
మరోవైపు తిరుమలలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Published Sat, Aug 10 2013 8:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement