‘శైలు’ జంట అల్లరి
‘ఎద చుట్టేసి.. కనికట్టేసి.. ననుపట్టేసిందో జాబిల్లి’ అంటూ శైలు చిత్ర హీరో కిరణ్, హీరోయిన్ షాలూపై యుగళగీతాన్ని చిత్రీకరించారు. కొవ్వూరు మండలంలోని దొమ్మేరు సావరం, దొమ్మేరు పరిసరాల్లో పంట పొలాల్లో శైలు చిత్ర షూటింగ్ శనివారం సందడిగా సాగింది. దర్శకుడు గారపాటి సందీప్ పర్యవేక్షణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బ్రదర్ ఆనంద్ నృత్య దర్శకత్వంలో హీరోహీరోరుున్లు స్టెప్పులేసి అల్లరి చేశారు. కెమెరామెన్‌గా మహీ చేర్ల, రచయితగా వాసు దొడ్డిపట్ల, నిర్మాత మరపట్ల కళాధర్ చక్రవర్తి వ్యవహరిస్తున్నారు.
- కొవ్వూరు రూరల్