సాక్షి, హైదరాబాద్ : అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో ఖాళీ కానున్న ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నామని శుక్రవారం ప్రకటించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment