
‘సమైక్య శంఖారావం’ నేటి నుంచి పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర సోమవారం నుంచి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ సమైక్య శంఖారావం ఈ నెల 17 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా జగన్‌కు తీవ్ర మెడనొప్పి కారణంగా మూడు రోజులు వాయిదా పడిన విషయం విదితమే. సోమవారం ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.
రేణిగుంట వివూనాశ్రయుం నుంచి రోడ్డు వూర్గంలో బయులుదేరి నగరి నియోజకవర్గంలో సమైక్య శంఖారావం కొనసాగిస్తారు. కేఎల్‌ఎం సర్కిల్, గాజులమండ్యం, అతూరు, పుడి, కాయం పర్యటిస్తూ బ్రహ్మణపట్టెడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఆ తర్వాత పత్తిపుత్తూరులో కూడా వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి అప్పాలాయగుంట, తిరుమన్యం, గోలకంద్రీగ, వడమలపేట, తడుకు, పుత్తూరులో బహిరంగసభ ఉంటుందని రఘురాం వెల్లడించారు.