కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుండటంతో సమైక్యాంధ్ర ఉద్యమం అదేస్థాయిలో ఉవ్వెత్తున కొనసాగుతోంది. తెలుగుజాతిని విడదీయవద్దంటూ జిల్లావాసులు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. గురువారం సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలులో సమైక్యాంద్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో జేడ్పీ గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహా త్ముని విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని ఆందోళన జరిపారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అర్ధనగ్నంగా రాజ్‌విహార్ వరకు ప్రదర్శన నిర్వహించి జిల్లా పరిషత్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఆదోనిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆదిమానవుల వేషధారణలో ప్రదర్శన నిర్వహిం చారు. బనగానపల్లెలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెగర్జన విజయవంతమైంది. నంద్యాలలో పీఆర్, రెవెన్యూ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. డోన్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో 71వరోజు దీక్షలు కొనసాగాయి. వెల్దుర్తిలో ప్రైవేటు స్కూలు యా జమన్యం ఆధ్వర్యంలో అర్థనగ్నంగా దీక్షలు చేపట్టారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరహార దీక్షల్లో 20 మంది మహిళా ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ మహిళా నాయకురాలు, మాజీ మండలాధ్యక్షురాలు ఎస్.నాగరత్నమ్మ, కాంగ్రెస్ నాయకులు ప్రమోద్‌కూమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దేవనకొండలో ఐరన్‌బండబీ సెంటర్ గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో సమైక్యవాదులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు పట్టణంలోని హెచ్‌బీఎస్ కాలనీలోని టేకు వనంలో శ్రమదానం చేశారు.
పోరాటం..అవిశ్రాంతం
Published Fri, Oct 11 2013 4:04 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement