ఏపీఎండీసీ ప్రతిపాదించిన ధరలను తిరస్కరించిన ప్రభుత్వం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపీఎండీసీ) ప్రతిపాదించిన ఇసుక ధరలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదించిన ధరలు బాగా తక్కువగా ఉన్నాయని కొత్త ధరలను రూపొందించాలని కోరింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం కొత్త ఇసుక విధానం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఇసుక విధానం ప్రకారం ఇసుక ధరలను ఖరారు చేసే బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించగా.. వారు ఈ నెల 4వ తేదీన ఇసుక ధరలను నిర్ణయించి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచింది. పొక్లెయిన్ వంటి మిషన్ల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌లో టన్ను ఇసుక ధర రూ. 157గా .. పూర్తిస్థాయిలో మనుషుల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌ల వద్ద టన్ను ఇసుక రూ. 211గా ప్రతిపాదించారు.
మిషన్లు, కూలీలను సమంగా ఇసుకకు టన్ను ఇసుక ధరను రూ. 177గా ప్రతిపాదించారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే అమ్మకాలు నిర్వహించే డ్వాక్రా సంఘాలకు 25 శాతం మేర చెల్లించాల్సి ఉందని.. దీనికి తోడు రైతు రుణమాఫీకి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సాధికారిత సంస్థకు ఇసుక అమ్మకాల నుంచి భారీగా నిధులు జమ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులు ఏపీడీఎంసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనితో కొత్త ప్రతిపాదనలపై దృష్టి పెట్టారు.
ఇసుకకు కొత్త ధరలు ప్రతిపాదించండి
Published Sat, Oct 11 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement