కృష్ణా: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు, వాహన డ్రైవర్ల ఆగడాలపై చర్యలు తీసుకోవాలంటూ చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం గ్రామస్తులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు.
అధికారులు వచ్చే వరకు నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్ధసారథి ధర్నాలో పాల్గొన్నారు.