‘పచ్చ’ పెత్తనానికి ముకుతాడు | Sarpanch Have Power In East Godavari | Sakshi
Sakshi News home page

సర‍్పంచికే పవర్‌

Published Sun, Feb 16 2020 10:39 AM | Last Updated on Sun, Feb 16 2020 10:39 AM

Sarpanch Have Power In East Godavari - Sakshi

గత టీడీపీ సర్కారు హయాంలో జిల్లాలో కన్నీరు పెట్టిన పల్లెలు ప్రగతిబాట పట్టనున్నాయి. జన్మభూమి కమిటీల సభ్యుల కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్య పట్టాలు ఎక్కనుంది. ఎన్నికలు నిర్వహించడమే కాకుండా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: పల్లెల్లో సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలైన గ్రామ స్వరాజ్యం సాకారం కానుంది. మొన్నటి వరకూ గ్రామ సచివాలయాల్లో భాగంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థతతో పాలన ప్రజల ముందుకు తీసుకువెళ్లగా.. తాజాగా సర్పంచి పదవులకు జవజీవాలు ఇవ్వనుండడంతో పల్లె మోములో చిరునవ్వు కనిపించబోతోంది. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో సర్పంచులను డమ్మీలుగా మార్చేసి జన్మభూమి కమిటీల ముసుగులో పచ్చ నేతలు పెత్తనం కొనసాగించారు. పెన్షన్‌ ఇవ్వాలన్నా...రేషన్‌కార్డు మంజూరు చేయాలన్నా.. ఏ పథకంలో లబి్ధదారుడిగా ఎంపిక కావాలన్నా పేదరికం అర్హత కానేకాదు. టీడీపీ నేతలు సిఫార్సులు చేస్తే సరి అన్నట్టుగా సాగింది గడిచిన ఐదేళ్ల పాలన.

గ్రామ పంచాయతీల అభివృద్ధికి మంజూరైన నిధులు మరో కార్యక్రమాలకు మళ్లించడం ద్వారా గ్రామ పరిపాలన జన్మభూమి కమిటీల కన్నుసన్నల్లోనే నడిచింది.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గత పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పారదర్శక పాలనకు గ్రామ పంచాయతీల్లో తలుపులు బార్లా తెరిచారు. గాం«దీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో గ్రామ పంచాయతీలు, సర్పంచుల విధి విధానాల్లో అనూహ్య సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఇంతకాలం ఎన్నికలు లేకండా చేసి నిరీ్వర్యం చేసిన జన్మభూమి కమిటీల ప్రభావానికి దూరంగా ప్రజలతో ఎన్నుకోబడే ప్రతినిధిని వపవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారు. 

టీడీపీ హయాంలో అన్నీ నష్టాలే... 
జిల్లాలో 1072 గ్రామ పంచాయతీలున్నాయి. ఇన్ని పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంటుంది. జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఏడాదిలో ఆరు నెలలకు ఒక పర్యాయం విడుదలయ్యే ఈ ని«ధులు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి. ఏడాదికి రూ.180 కోట్లు విడుదలవుతుంటాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏలుబడిలో 2018 ఆగస్టు నెలతో గ్రామ పంచాయతీ సర్పంచులు, పాలకవర్గాల పదవీ కాలం ముగిసిపోయాయి. ఆ తరువాత గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించకుండా చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

టీడీపీ సర్కార్‌ నిర్వాకంతో జిల్లాలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.270 కోట్లు అందకుండా పోయాయి. మేజర్‌ గ్రామ పంచాయతీలకు కొద్దోగొప్పో పన్నులు, అద్దెలు రూపంలో వచ్చే నిధులుంటాయి. అటువంటి చోట గుడ్డిలో మెల్ల సామెత చందంగా ప్రజల కనీస అవసరాలు తీర్చేవారు. ఎటొచ్చీ జిల్లాలో 687 మైనర్‌ గ్రామ పంచాయతీలకు కేవలం ఆర్థిక సంఘం నిధులే దిక్కు... మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నిధులు విడుదల కాకపోవడంతో ఆ పంచాయతీల్లో కనీసం పారిశుద్ధ్యం, మంచినీటి పైపులైన్ల మరమ్మతులు చేయించలేక ప్రత్యేకాధికారులు చేతులెత్తేసిన పరిస్థితులున్నాయి. పాలకవర్గాలు ఉండి ఉంటే నిధులు విడుదల కాకున్నా స్థానికంగా ఉన్న పలుకుబడిని వినియోగించి ప్రజల కనీస సౌకర్యాలు కల్పించే వారు. 2018 ఆగస్టు నుంచి జిల్లాలో కుంటుపడింది.   

ప్రజాసంకల్ప యాత్రలో స్వయంగా చూసి...
వీటన్నింటినీ పాదయాత్రలో స్వయంగా పరిశీలించిన ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు కూడా తిరగకుండానే పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్ణయించి రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పల్లెలు స్వాగతిస్తున్నాయి. పాలనా పరంగా విధి విధానాలే కాకుండా సర్పంచి పదవులకు పోటీచేసే వారికి కొన్ని అర్హతలతో కూడిన బాధ్యతలను కూడా నిర్థారించడం మేధావి వర్గాన్ని కూడా ఆలోచనలో పడేసింది. ప్రజలచే ఎన్నికైన సర్పంచి కచ్చితంగా ప్రజల మధ్యే స్థానికంగానే నివాసం ఉండాలనే నిర్ణయం సాహసోపేతమైందిగా అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. సొంతూరులో ఉండకుండా వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు స్థిరపడి పంచాయతీ ఎన్నిల సమయాన సొంతూరు వచ్చి రూ.లక్షలు కుమ్మరించి సర్పంచిగా ఎన్నికై పట్టణాల్లో ఉంటానంటే ఇక కుదరదు. పట్టణాల్లో ఉంటూ పల్లె పాలన సాగదనే ముందుచూపుతో మంచి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారంటున్నారు. ఎన్నికల్లో డబ్బు సంచులతో పల్లె ఓటర్లను అడ్డగోలుగా ప్రలోభాలకు గురిచేసి  సర్పంచి పదవులు కొట్టేయాలనే కుట్ర రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా సీఎం ఆలోచన ఆదర్శప్రాయమంటున్నారు. సర్పంచులు ఇక ముందు 24 గంటలూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. 

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేస్తూ సొమ్ములతో పట్టుబడితే ఆ సర్పంచి అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది. జైలుకు పంపించే చట్టం కూడా రాబోతోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల వ్యవస్థతో స్థానిక పాలన ప్రజల ఇళ్ల ముంగిటకే కాదు, ఇంటి తలుపులు తట్టేలా చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ద్వారా కొత్త సంస్కరణలతో సర్పంచి పదవి గ్రామ స్వరాజ్యానికి రాజును చేసేలా పంచాయతీల చిత్రం మారబోతోంది. పంచాయతీ అంటే రాష్ట్రం మొత్తానికి సచివాలయం (సెక్రటేరియట్‌) ఏ స్థాయిలో... ఎన్ని అధికారాలతో పనిచేస్తుందో గ్రామ స్థాయిలో కూడా గ్రామ సచివాలయాలు అదే అధికారాలతో..అదే విభాగాల పని విభజనతో పనిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం ఇప్పటికే సచివాలయాల ద్వారా 50 శాతం విజయవంతమయ్యాయి. గ్రామ సర్పంచుల ఎన్నికల విధానాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో ఆ మిగిలిన 50 శాతం లక్ష్యం సాకారమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
పెంకే గోవిందరాజు మాజీ సర్పంచి, మాజీ సర్పంచుల సమైఖ్య మండల అధ్యక్షుడు 
స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సర్పంచులకే అన్ని అధికారాలు ఇవ్వడంతోపాటు ఓటుకు డబ్బులు ఇవ్వకుండా తగిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి నుంచి గ్రామ పరిపాలన మార్పు చెందుతుంది. గతంలో ఓటుకు డబ్బులు ఇవ్వడం వల్ల గ్రామాల అభివృద్ధి జరిగేది కాదు. ఇప్పుడు స్వార్థం కోసం కాకుండా సర్పంచులు గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. – పెంకే గోవిందరాజు


నూతన శకానికి నాంది 
స్థానిక సంస్థల ఎన్నికలు మద్యం, ధన ప్రవాహానికి తావులేకుండా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ద్వారా నూతన శకానికి నాంది పలికారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా చర్యలు తీసుకోవడం, గ్రామ స్థాయిలో సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కలి్పంచడం ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాట వేశారు.
– మట్టపర్తి వెంకట్రావు, మాజీ సర్పంచ్, గంటి, కొత్తపేట మండలం 

స్థానికంగా ఉండాలనడం హర్షణీయం
సర్పంచ్‌ ఎన్నికలపై క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం హ ర్షించదగ్గ విషయం. అత్యంత కీలకమైన చెక్‌ పవర్, గ్రామ అభివృద్ధికి తీసుకునే నిర్ణయం సర్పంచ్‌కే ఉంటుంది. బాధ్యతతో చేయాల్సిన పదవి సర్పంచ్‌. ప్రభుత్వం మరింత బాధ్యతను పెంచుతూ సర్పంచ్‌లు స్థానికంగా ఉండాలని చట్టాలను సవరించడం ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం కీలకం. 
– కుంచే రాజా, మాజీ సర్పంచ్, సూరంపాలెం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement