ఎన్టీఆర్‌ ఇచ్చిన స్థలానికి బాబు డబ్బులు కట్టమంటున్నారు | SC Colony Womens Complaint to Collector In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఇచ్చిన స్థలానికి బాబు డబ్బులు కట్టమంటున్నారు

Published Tue, Jun 26 2018 1:30 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

SC Colony Womens Complaint to Collector In Visakhapatnam - Sakshi

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఎండాడ ఎస్సీకాలనీ వాసులు

బీచ్‌ రోడ్డు(విశాఖ తూర్పు): అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు ఉచితంగా స్థలం ఇస్తే.. అదే టీడీపీ ప్రస్తుత అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ స్థలానికి డబ్బులు కట్టాలని నోటీసులు ఇవ్వడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడంతో లేదు. సొమ్ములు కూడా తక్కువేమి కాదు.. ప్రతి కుటుంబం రూ. 90 వేలు నుంచి రూ.2 లక్షల కట్టాలంటున్నారు. చివరికి ఏం చేయాలో తెలియక సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నారు. జీవీఎంసీ 6వ వార్డు ఎం డాడ ప్రాంతంలోని ఎస్సీ కుటుంబాలు కో సం 1982లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 103 సెంట్లు కేటాయించారు. అప్పటి నుంచి అý్కడ సుమారు 56 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు భూక్రమబద్ధీకరణలో భాగంగా ఆ కాలనీ ప్రజలు డబ్బులు కట్టాలని నోటీసులు జారీ చే శారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించా లంటే తమవల్ల కాదని వారంతా వాపోతున్నారు.

స్థలం సమానమే.. చెల్లింపు డబ్బుల్లో వ్యత్యాసం
అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాల ఇళ్ల స్థలాలు అన్నీ సమానంగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం జారీ చేసీన నోటీసుల్లో మాత్రం ఒక్కో కుటుంబానికి ఒక్కో రకంగా డబ్బులు కట్టాలని చూపించారు. రూ.90 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నీ ఇళ్ల స్థలాలు సమానంగా ఉన్నా ఈ సొమ్ముల్లో మార్పు చూసి ప్రజలు అసలు ఏమీ జరుగుతుందో కూడా అర్ధం కావటం లేదని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రోజు కూలీ పనులు చేసుకునే తాము అంత డబ్బులు కట్టలేమని కలెక్టర్‌ స్పందించి ఉచితంగా పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.   

అంతా డబ్బు ఎట్టా చెల్లించేది?
ఇప్పటికిప్పుడు రూ. 1.62 లక్షలు చెల్లిస్తే ప్ర భుత్వం పట్టా ఇస్తుం దని నోటీసు ఇచ్చారు. రోజు కూలి పని చేసుకుని జీవిస్తున్నాం. మా కు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఎన్టీ ఆర్‌ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడ మే పట్టాలు ఇవ్వడానికి డబ్బులు చెల్లించాలని చెప్పడం దారుణం.– సర్వసతి, కాలనీవాసి

అందరికీ సమానంగా రాలేదు
మా కాలనీలో నివాసం ఉంటున్న అన్నీ కుటుం బాల ఇళ్ల స్థలాలు సమానంగానే ఉన్నాయి. అయితే క్రమబద్ధీకరణ కోసం చెల్లించవలసిన డబ్బులు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా వచ్చింది. మేము అంత మొత్తం చెల్లించే పరిస్థితిలో కూడా లేము. ప్రభుత్వం ఉచితంగానే పట్టాలు ఇవ్వాలి.    – పద్మ, కాలనీవాసి

ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు
ఎండాడ ఎస్సీ కాలనీ అభివృద్ధిని ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. శ్రీదేవి విజ్ఞాన పరిష్కర వేదిక ద్వారా ఇక్కడ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొంత మేర పరిష్కరిస్తున్నాం. ఇళ్ల పట్టాల కోసం అంత డబ్బులు చెల్లించాలంటే వీరి వల్ల అయ్యే పని కాదు. అందుకే కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. – కీర్తి, అధ్యక్షురాలు, శ్రీదేవి విజ్ఞాన పరిష్కర వేదిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement