లక్ష్యానికి దూరంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు | SC Corporation loans | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి దూరంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు

Published Mon, Mar 7 2016 2:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

లక్ష్యానికి దూరంగా   ఎస్సీ కార్పొరేషన్ రుణాలు - Sakshi

లక్ష్యానికి దూరంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు

స్క్రీనింగ్ కమిటీ సభ్యుల కొర్రీలు
సభ్యుల తీరుపై పార్టీలోనే వ్యతిరేకత
కొన్నిచోట్ల డబ్బుల డిమాండ్

 
నూజివీడు: ఎస్సీ కార్పొరేషన్ రుణాల లక్ష్యం ఆమడదూరంలో నిలిచేలా ఉంది. రుణాలు పొంది ఆర్థికాభివృద్ధి సాధిద్దామనుకుంటున్న యువతకు మొండిచెరుు్య మిగిలేలా ఉంది. మరో 25 రోజుల్లో ఆర్థిక సంవత్సరం పూర్తి కానుంది. ఇప్పటికీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల అవినీతి, టీడీపీ నాయకుల పెత్తనంతో జాబితాలు మండలాలు, పట్టణాలు నుంచి కార్పొరేషన్ ఈడీకి చేరడం లేదు. దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
 
 చేయాల్సిన తీరు ఇది..
ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు ప్రతి మండలం నుంచి ఎంపీడీవో, మున్సిపాలిటీల నుంచి మున్సిపల్ కమిషనర్లు అర్హుల జాబితాలను ఈడీ కార్యాలయానికి పంపించాలి. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారందరికి బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించి జాబితా ఇస్తారు. జాబితాపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు వ్యక్తుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సంతకాలు చేయాలి. తరువాత మండలంలో ఎంపీపీ, ఎంపీడీవోలు, మున్సిపాలిటీలో చైర్మన్, కమిషనర్‌లు సంతకాలు చేస్తారు. ఆ జాబితాను ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి పంపుతారు. అప్పుడు లబ్ధిదారుల పేరున ప్రభుత్వ రాయితీని ఆయా బ్యాంకులకు పంపుతారు.  

 7328 యూనిట్లు.. 1848 మందికి రుణాల మంజూరు
జిల్లాకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.103 కోట్లు కేటాయించింది. 7328 యూనిట్లు మంజూరు చేసింది. జిల్లాలోని పలు మండలాలు, మున్సిపాలిటీల నుంచి 2697 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో 1848 మందికి రుణాలు మంజూరు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా కేవలం 20 శాతం లబ్ధిదారులనే ఎంపిక చేశారు. మిగిలిన వారిని 25 రోజుల్లో చేయాలి. నూజివీడు పట్టణానికి  82 యూనిట్లు మంజూరు కాగా 48 మందికి స్క్రీనింగ్ కమిటీ సంతకాలు చేసింది.

ఆగిరిపల్లి మండలంలో 32 యూనిట్లు మంజూరు కాగా 19 మందికి, గుడివాడ పట్టణానికి 118 యూనిట్లు కేటాయించగా 47 మందికి సంతకాలు చేశారు. గత ఏడాది నవంబరులోనే బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. రుణాలు మంజూరుకు అనుమతి ఇచ్చిన దరఖాస్తుదారుల వివరాలను ఇచ్చారు. ఇంతవరకు అవి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యుల వ్యవహారశైలితో లబ్ధిదారులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
స్క్రీనింగ్ కమిటీ సభ్యుల సంతకాలతోనే చిక్కంతా..
 స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా టీడీపీ కార్యకర్తలను నియమించారు. వారు తమకు ఇష్టమైన వారికి, ఆమ్యామ్యాలు సమర్పించుకున్న వారికి సంతకాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో రుణం మంజూరు అయిన తరువాత ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలో 20 శాతం నుంచి 50 శాతం వరకు వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కొన్ని పట్టణాలలో నాయకులకు, సభ్యులకు మధ్య సఖ్యత లేక జాబితాపై సంతకాలు చేయడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పేదలు కోల్పోయే పరి స్థితులు నెలకొంటున్నాయి. ఆయా వర్గాలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతో ంది. ఎస్సీ కార్పొరేషన్ రుణం కావాలంటే  వేలాది రూపాయలు అడుగుతున్నారని బహిరంగంగానే  చెప్పుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement