కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిర జలప్రభ (ఐజేపీ) కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూములు అభివృద్ధి చేసి మార్చి నెలాఖరు నాటికి 10 వేల ఎకరాలను సాగులోకి తెస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లోని అడిటోరియంలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోని సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలకు జీవో నం. 10లోని 25 అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐజేపీ కింద ఎంపికైన బ్లాక్‌ల లో ఈ నెల చివరి నాటికి 5వేల ఎకరాలను సాగులోకి తెచ్చేలా పనులను వేగవంతం చేస్తామన్నారు.
ట్రాన్స్‌కో, ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు, ఎపీఎంఐపీ ద్వారా బిందుసేద్యం, బోరు మోటార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి మండలం ఎర్ధనూర్, నర్సాపూర్ మండలం గోమార్ గ్రామాలు ఐకేపీ కింద ఉన్నాయన్నారు. కోహీర్ మండలంలోని కేవలం 6 గ్రామాలు మాత్రమే ఐజేపి కింద ఎంపిక చేశారని ఆ మండల పరిధిలోని వివిధ గ్రామల సర్పంచులు కలెక్టర్ దృష్టికి తేగా ఏపీడీల ద్వారా ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్ సూచించారు. న్యాల్‌కల్ మండలం టేకూర్ గ్రామంలో వాటర్‌షెడ్ పథకం చేపట్టి భూగర్భ జలాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ అధికారుల దృష్టికి తెచ్చారు. మనూర్ మండలం కారముంగిలో ఐజేపీ కింద 100 ఎకరాలను గుర్తించామని మార్చి నాటికి దానిని పూర్తి అభివృద్ధిలోకి తేస్తామని కలెక్టర్ తెలిపారు.
వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయండి
గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు నిర్దేశించిన వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాన్ని 100 శాతం పూర్తి చూస్తే నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద ప్రతి గ్రామానికి రూ. 20 లక్షల నిధులు వస్తాయని సర్పంచ్‌లకు సూచించారు. వీటి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చన్నారు. సదస్సులో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్ ప్రకాశ్, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ లకా్ష్మరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
37 కోట్ల వ్యయంతో 42 ఎకరాల అభివృద్ధి
సంగారెడ్డి రూరల్ : ఇందిర జల ప్రభ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చెందిన బీడు భూములను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. సంగారెడ్డి మండలం ఎర్దనూర్ శివార్‌లో ఇందిర జల ప్రభ బ్లాక్‌లను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో ఒకే ప్లాట్‌గా ఉన్న 42 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రూ.37.72 కోట్ల వ్యయంతో బోరుబావుల తవ్విస్తున్నట్లు ఆమె వివరించారు. ఎర్దనూర్‌లో ఇందిర జలప్రభ బ్లాక్‌లో 26 మంది లబ్దిదారులు ఉండగా, వీరిలో 24 మంది ఎస్సీలు కాగా, మిగతా ఇద్దరు గిరిజనులని తెలిపారు. ప్రస్తుతం 18 ఎకరాల భూమిలో నాలుగు బోరుబావులు ఏర్పాటు చేశామన్నారు. ఈ భూముల్లో సూక్ష్మ బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులకు పరికరాలను కూడా అందజేస్తున్నట్లు వివరించారు.
‘ఇందిర జలప్రభ’తో ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధి
Published Fri, Feb 21 2014 11:48 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement