అలా మొదలైంది ... | Schools restart | Sakshi
Sakshi News home page

అలా మొదలైంది ...

Published Tue, Jun 14 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

అలా మొదలైంది ...

అలా మొదలైంది ...

పాఠశాలలు పునఃప్రారంభం
అయిష్టంగా పిల్లలు బడిబాట
ప్రైవేట్ స్కూళ్లలో తాయిలాలతో స్వాగతం
భవిష్యత్‌కు పునాది బడి అది నీ జీవితానికి అవ్వాలి ఒరవడి
మారాం చేయకురా కన్నా
..బడికి వెళ్లరా నాన్నా..

 
జిల్లాలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు                 పునఃప్రారంభమయ్యాయి. పిల్లలు పలకాబలపం పట్టుకుని, బ్యాగును చంకన ఎత్తుకుని బడిబాట పట్టడం కనిపించింది. రెండు నెలల పాటు మూగబోయిన తరగతి గదుల్లో మళ్లీ సందడి నెలకొంది. దుమ్ముదులిపి, పాఠాలు వళ్లించే పనుల్లో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. కొందరు చిన్నారులు బడికి వెళ్లక మారాం చేయడంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.

 

బడి గంటలు మో గాయి. వేసవిలో ఆటా పాటలతో గడిపిన గడుగ్గాయిల గుండెల్లు జల్లు మన్నాయి. మేము పాఠశాల కెళ్లమని మారాం చేశారు. అమ్మా నాన్నలు తమ బుజ్జాయిలను బుజ్జగించి, బడిబాట పట్టించడానికి బండెడు బాధలు పడ్డారు. ఎలాగోలా సర్ధిచెప్పి స్కూలులో వదిలారు. అక్కడా చిన్నారులను ఆకట్టుకోవడానికి మిఠాయిలు పంచారు. అయినా కొందరు కన్నీళ్లు పెట్టక మానలేదు. సోమవారం జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం అలా మొదలైంది.

 

చిత్తూరు(ఎడ్యుకేషన్) : జిల్లాలో బడిగంటలు మోగాయి. సుమారు 43 రోజుల పాటు వేసవి సెలవులకు అలవాటుపాడిన విద్యార్థులు సోమవారం పాఠ శాలకు వెళ్లడానికి మారం చేశారు. మొదటిరోజు పాఠశాలకు వెళితే చదువు బాగా వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు బుజ్జగించి పంపా రు.  విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. హైస్కూల్ విద్యార్థులు తొలి రోజు  స్నేహితులతో వేసవి విశేషాలను చర్చించుకున్నారు.   

 
సాధారణ దుస్తులతో విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్ అందజేయకపోవడంతో వారు సాధారణ దుస్తులతో పాఠశాలకు హాజరయ్యారు. ఏటా యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఇచ్చిన యూనిఫామ్ చిరిగిపోవడంతో చాలా మంది విద్యార్థులు మొదటి రోజు రంగుల దుస్తులను ధరించి పాఠశాలకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది.

 
అమలుకాని సంప్రదాయదుస్తులు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లో హాజరు కావాలని రాష్ట్ర విద్యాశాఖ గత మే నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో ఆ ఆదేశాలు ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. దీంతో ఉపా ధ్యాయులు తొలిరోజున  ఎప్పటిలాగే యథాతథంగానే పాఠశాలలకు హాజరయ్యారు.

 
అడ్మిషన్లు తక్కువే

ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన మేరకు విద్యార్థులు హాజరుకాకపోగా, నూతనంగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని తెలిసింది. గత మూడు సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.

 

బడి గంట మోగిన వేళ..
తిరుపతి ఎడ్యుకేషన్ : వేసవి సెలవులు అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలో చేర్పించేందుకు, తమ పిల్లలను పాఠశాలల్లో వదిలి పెట్టేందుకు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులూ బడిబాట పట్టారు. పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేస్తూ పిల్లలు, చిన్నారులను బుజ్జగిస్తూ తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకొచ్చారు. కొత్తగా బడిబాట పట్టిన చిన్నారులను తల్లిదండ్రులు, తరగతిలో ఉపాధ్యాయులు ఓదార్చారు. బడికి వెళ్లనంటూ మారాం చేస్తున్న చిన్నారులకు దుకాణంలో చిరుతిండ్లు కొని ఇచ్చి పాఠశాలకు పంపించారు. వేసవి సెలవులకు టాటా చెబుతూ బడికి వచ్చిన  పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement