విజయనగరం అర్బన్: ఆదర్శ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడడం వల్ల నిధుల ఖర్చులకు లెక్కాపక్కా లేకుండా పోతోంది. అధిక ధరలకు సైన్స్ ల్యాబ్ సామగ్రి కొనుగోలు చేయడపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రయోగ పరీక్షలకు ల్యాబ్ సామర్థ్యాలపై ఇంటర్మీడియట్ పర్యవేక్షక బృందం చేపట్టిన పరిశీలనలో ఈ విషయూలు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ సామగ్రి పేరుతో కొనుగోళ్లు చేస్తున్నా.. చాలా పాఠశాలల్లో ఇవి కానరాకపోవడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
నిధుల వ్యయంపై ఆరోపణలు
జిల్లాలో 16 ఆదర్శపాఠశాలలు ఉండగా.. అన్నింటిలోనూ ఇంటర్మీడియట్ కోర్సును నిర్వహిస్తున్నారు. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 6,400 మంది, ఇంటర్మీడియట్‌లో 5,120 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలకు వస్తున్న నిధుల వ్యయంపై పలు ఆరోపణలున్నాయి. ఒక విధానమంటూ లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఖర్చు చేస్తున్నారు. 2013లో జిల్లాకు మొదటి విడతలో 16 విద్యాలయూలు మంజూరయ్యూరుు.
ప్రారంభ సమయంలో టేబుళ్లు, కుర్చీలు, ల్యాబ్ సామగ్రి, మెడికల్ కిట్లు, మరమ్మతులు, క్రీడలు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు, రిజిస్టర్లు, ఇతరత్రా నిర్వహణకు ప్రభుత్వం 4,74,600 రూపాయలు విడుదల చేసింది. అలాగే 2014లో పరీక్షల నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.2.50 లక్షలు కేటాయించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 లక్షలు మంజూరు చేసింది. అయితే పాఠశాలలకే నేరుగా వచ్చే నిధుల వ్యయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సంబంధిత ప్రిన్సిపాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
బిల్లుల్లో వ్యత్యాసం
సైన్స్ ల్యాబ్‌లకు అవసరమైన సామాగ్రి కొనుగోళ్లలో ఒక్కో పాఠశాల ప్రిన్సిపాల్ ఒక్కో బిల్లు చూపడం విశేషం. కాంపౌండ్ మైక్రోస్కోప్‌ను ఒకరు 3,600 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చూపిస్తే, మరో పాఠశాల ప్రిన్సిపాల్ ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. సాధారణంగా సామగ్రి కొనుగోలు చేస్తే బిల్లులు తీసుకోవాలి. కానీ చాలా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇన్‌వాయిస్, కొటేషన్ బిల్లులే తీసుకోవడం విశేషం. అదే విధంగా సైన్స్ ల్యా బ్‌ల్లో వాడే మెజరింగ్ జార్స్‌ను రూ.50 నుంచి రూ.900 వరకు కొనుగోలు చేశారు.
ఈ ధరల్లోని తేడాలను సమర్థించుకునేందుకు తమ వస్తువు మంచిదంటే తమ వస్తువు మంచిదని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. డిసెక్షన్ మైక్రోస్కోప్‌ను ఒకరు రూ.2 వేలు, మరొకరు 1,500 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇంత చేసినా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ల్యాబ్ సామగ్రి లేదు. ఇటీవల ఇం టర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఓ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సర్వేలో ఐదు పాఠశాలల్లో మాత్రమే 60 శాతం సామగ్రి మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన పాఠశాలల్లో పరికరాలు ఏమయ్యూయో సిబ్బందికే తెలి యూ లి. అలాగే విద్యార్థుల విజ్ఞాన, వినోత యాత్ర లు, క్రీడ ల నిర్వహణకు వస్తున్న నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పరిశీలన ఏదీ..?
ఆదర్శన పాఠశాలల పరిశీలన బాధ్యతను జిల్లా స్థాయిలో డీఈఓకు అప్పగించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల బాధ్యతలతో బిజీబిజీగా ఉంటున్న డీఈఓ వాటిపై దృష్టి సారించలేకపోతున్నారు.
అంతా మా ఇష్టం..
Published Sun, Dec 27 2015 11:53 PM | Last Updated on Sat, Sep 15 2018 7:39 PM
Advertisement