
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండవరోజు వైభవంగా జరుగుతున్నాయి. మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ తిరుమాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం... శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనంపై దర్శిస్తే కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రాత్రికి హంసవాహన సేవ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment