సాక్షి, పశ్చిమ గోదావరి: గత ప్రభుత్వ బాధ్యతారాహిత్యం రైతుల పాలిట శాపంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో జనవరి నుంచే ప్రభుత్వం విత్తనాలను సేకరిస్తుంది. కానీ గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విత్తనాల కొనుగోలుకు కేటాయించాల్సిన నిధులను ఎన్నికల పథకాల కోసం ఖర్చు పెట్టింది. దీంతో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ గోదావరిలో విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కోసం కేటాయించిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా వాటిని గత ప్రభుత్వం లెక్కచేయలేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. చేసిన తప్పులు చాలక టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేయటంపై రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన విత్తనాలు సేకరించి రైతులకు అందజేయాలని ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment