రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నయం లేదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అందరం నిర్ణయించుకున్నామని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తెలిపారు.
మరోవైపు ఈనెల 7న ఏపీ ఎన్జీవోల సభకు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతలు ఈరోజు ఉదయం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటల పాటు ఈ దీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోసం తాము 48 గంటలు నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్ ప్రకటించారు. ఈ దీక్షకు దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.