
సీమాంధ్ర నేతలకు ప్రజలు పట్టరా?: ఎంపీ వివేక్
సీమాంధ్ర నేతలకు స్వప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
హైదరాబాద్: సీమాంధ్ర నేతలకు స్వప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీమాంధ్ర అభివృద్ధికోసం 1.50 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోకుండా, అభివృద్ధి గురించి చర్చించకుండా ఆ ప్రాంత నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటు ఆగదని తెలిసినా ఇంకా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా ఓటింగుకోసం పట్టుబట్టే కుట్రలకు దిగుతున్నారని అన్నారు. ‘మాది మాగ్గావాలెనని తెలంగాణ కొట్లాడుతున్నది. మాది మాగ్గావావాలె, మీది కూడా మాకే కావాలెనని సీమాంధ్ర నేతలు కొట్లాడుతున్నరు, ఇదెక్కడి న్యాయం’ అని వివేక్ ప్రశ్నించారు.