నేతల విజ్ఞప్తులకు విలువ ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానం
రాష్ట్ర విభజనను అడ్డుకుంటామ
న్నారు.. ఢిల్లీ పెద్దలను ఒప్పిస్తామని
హామీలిచ్చారు.. ప్రజాకాంక్ష మేరకు
రాష్ట్ర సమైక్యతకు పాటుపడతామని
ప్రతిజ్ఞ చేశారు.. ఈ మాటలన్నీ నేడు
ఒట్టివే అని తేలిపోయింది. ఎంతో
రాజకీయానుభవం ఉన్న జిల్లా నేతల
విజ్ఞప్తులను కాంగ్రెస్ అధిష్టానం గడ్డిపో
చలా తీసేసింది. గురువారం కేంద్ర
కేబినెట్‌లో తెలంగాణ బిల్లుకు
ఆమోదం లభించింది. దీంతో సీమ
ప్రజల మనోభావాలను దెబ్బతిన్నట్ల
యింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి నేటి వరకు జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు రోజుకొక డ్రామాకు తెరతీశారు. విభజనపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వటంతో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చిన ఇరు పార్టీ నేతలు యూటర్న్ తీసుకున్నారు. తామంతా సమైక్యానికే కట్టుబడి ఉన్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రెస్‌మీట్లు పెట్టి భారీ స్టేట్‌మెంట్లు ఇస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయినా జనం నమ్మకపోవటంతో రాజకీయ భవిష్యత్ కోసం సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. ‘రాయల తెలంగాణా’ను తెరపైకి తెచ్చారు. అందుకు పంచాయతీ తీర్మానాలు చేయించారు. అధికారుల ద్వారా రహస్య నివేదికలు జీఓఎంకు పంపారు. చివరి ప్రయత్నం కూడా నెరవేరక పోవటంతో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. పార్టీల్లో ఉండాలా? వీడాలా? అనే కోణంలో రాత్రంతా నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్, టీడీపీ నేతలు సుధీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏం చేద్దాం?
కేంద్ర ప్రభుత్వం పది జిల్లాలతో కూడిన తెలంగాణాకే ఆమోదం చెప్పటంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడ్డారు. అదే విధంగా విభజనకు
పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు తెలియజేసిన టీడీపీ నేతలు సైతం భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. ‘మా పార్టీలోకి వచ్చినా ప్రయోజనం ఉండదు’ అని టీడీపీ నేత ఒకరు కాంగ్రెస్ నాయకునితో తేల్చిచెప్పినట్లు సమాచారం. అదే విధంగా టీడీపీ నేత ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఆ పార్టీకి చెందిన నాయకులతో ఫోన్లో సంప్రదించినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ నేతలు కూడా ‘పొరపాటున కూడా పార్టీలో చేరవద్దు’ అని తేల్చిచెప్పటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
పరాభవం!
Published Fri, Dec 6 2013 1:33 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement