తిరుపతి : రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకంగా సీమాంధ్ర భగ్గుమంటోంది. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న తిరుపతి వాసులు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నారు. విద్యార్ది జేఏసి నాయకులు చిత్తూరు తిరుపతి ప్రధాన రహదారిపై ముళ్ల కంపలు వేసి నిప్పుపెట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కాగా
అర్థరాత్రి ఆందోళనకారులు బిఎస్ఎన్ టవర్లను తగులబెట్టారు. స్విమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మరో బీఎస్ఎన్ఎల్ టవర్‌కు నిప్పంటించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ టవర్లకు నిప్పు
Published Fri, Oct 4 2013 8:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement