సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల చేతకానితనం వల్లే రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి వచ్చిందని ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఎంపీలు, కేంద్రమంత్రుల వైఫల్యం వల్లే ఉద్యోగులు సమ్మెకు దిగాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఈనెల 12 అర్థరాత్రి నుంచి సమ్మె ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్, టీడీపీలు పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయపరమై నిర్ణయాలను ఎప్పటికప్పుడు మార్చుకునే పార్టీలు యాస, భాష ప్రకారం రాష్ట్రాన్ని విభజిస్తే.. ఆరు ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 13జిల్లాల ప్రజల మనోభావాలను పట్టించుకోరా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సుదీర్ఘకాలం పాటు సమ్మె చేయడానికి సిద్ధమని అంతకుముందు అశోక్‌బాబు ప్రకటించారు. సమైక్య ఉద్యమంలో కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని, లేదంటే సీమాంధ్రలో ఎప్పటికీ గెలవనివ్వమని హెచ్చరించారు.
12 నుంచి సమ్మె ఖాయం: ఏపీ ఎన్జీవోస్
Published Fri, Aug 9 2013 8:21 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement