'నా రాజకీయ భవిష్యత్పై 12న నిర్ణయం' | AP NGO's President ashok babu to announce political future on april 12th | Sakshi
Sakshi News home page

'నా రాజకీయ భవిష్యత్పై 12న నిర్ణయం'

Published Tue, Apr 8 2014 11:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'నా రాజకీయ భవిష్యత్పై 12న నిర్ణయం' - Sakshi

'నా రాజకీయ భవిష్యత్పై 12న నిర్ణయం'

తణుకు : రాష్ట్రాన్ని విడదీసిన బీజేపీ, టీడీపీకి బుద్ధి చెబుతామని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు హెచ్చరించారు. ఆయన మంగళవారం తణుకులో ప్రెస్మీట్లో మాట్లాడుతూ తన  రాజకీయ భవిష్యత్పై ఈ నెల 12న నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన రాజకీయ పార్టీలపై ఓట్లతో ప్రతీకారం తీర్చుకోవాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు.

ఉద్యోగ వ్యవస్థపై రాజకీయ ప్రాబల్యం తగ్గించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని ఆయన తెలిపారు. శాఖల విలీనం ద్వారా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అశోక్ బాబు హెచ్చరించారు. సీమాంధ్ర రాజధాని తర్వాత ఉద్యోగస్తులకు ఆప్షన్లు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుస్తులను రెగ్యులరైజేషన్ చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement