- నలుగురిని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్సుమెంట్
- ముగ్గురు అనంతపురం వాసులు
చిత్తూరు (అర్బన్): జిల్లాలో నకిలీ మద్యం విక్రయించే వారి గుట్టును ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గతనెల 24న పులిచెర్ల మండలం కె.కొత్తకోట వద్ద ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద 500 మద్యం బాటిళ్ల మూతలు, 43 నకిలీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని రామచంద్రానాయక్, క్రిష్ణానాయక్‌లను అరెస్టు చేశారు. అదేనెల 13న కుప్పంలో బాటిళ్లకు బిగించే 1.30 లక్షల మూతలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీ నం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఈ ఘటనలతో ఇక్కడ అంతర్రాష్ట్ర ముఠా ఉందని ప్రాథమిక ని ర్ధారణకు వచ్చిన జిల్లా డెప్యూటీ ఎక్సైజ్ కమిషనరు సత్యప్రసాద్ విచారణకు సీఐలు మోహన్‌కుమార్, వాసుదేవచౌద రి, సత్యనారాయణ, ఎస్‌ఐ మధుసూదన్‌నాయుడుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. శనివారం అనంతపు రం జిల్లా కదిరిలో నలుగురు నిందితులను అరెస్టు చేసి, పలు విషయాలు రాబ ట్టారు. మద్యం దుకాణాల్లోని మద్యం బాటిళ్లకు ఉండే మూతలను జాగ్రత్తగా తొలగించి అందులో ఉన్న బ్రాండెడ్ మద్యాన్ని సగం తీసి, మరో ఖాళీ బాటిల్‌లోకి పోసి రెండు బాటిళ్లలో నీళ్లను కలుపుతారు.
మళ్లీ బాటిల్‌కు తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కొత్త మూతలను సీల్ చేసి దుకాణాల్లో ఉంచి మద్యం ప్రియులకు విక్రయిస్తామని అంగీకరించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన గేట్ నాగరాజ్ (28)ను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఇతనిపై కర్ణాకటలో పలు కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు అనంతపురం జిల్లా కదిరికి చెందిన వెంకటరమణ (25), ముంగుబ్బకు చెందిన జనార్దన్‌రెడ్డి (30), గోరంట్లకు చెందిన విజయభాస్కర్ (28)ను జిల్లా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పాకాలకు చెందిన మద్యం దుకాణ యజమాని, గుమాస్తాపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ మద్యం రాకెట్ గుట్టురట్టు
Published Mon, May 4 2015 4:02 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement