జిన్నారం, నూస్‌లైన్: మండలంలోని గడ్డపోతారానికి చెందిన ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బొల్లారం ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలిక మంగళవారం రాత్రి టీవీ చూసేందుకు పొరుగింటికి వెళ్లింది.
ఆ ఇంట్లో ఓ వృద్ధుడు మాత్రమే ఉన్నాడు. అదే సమయంలో మరో పొరుగింటిలో ఉంటున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్ శివరాత్రి నరేష్(19) కూడా టీవీ చూసేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను ఇంటి పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్డులోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే చిన్నారి ఏడుస్తుండటంతో చుట్టుపక్కల వారు, తల్లిదండ్రులు వచ్చి ఆరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం సీఐ శ్రీనివాస్ సందర్శించారు. నిందితుడు నరేష్ తమ అదుపులో ఉన్నాడని, ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఐదేళ్ల బాలికపై లైంగికదాడి
Published Thu, Jan 16 2014 5:10 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM
Advertisement
Advertisement