
తల్లిదండ్రులతో శిరీషా
చిత్తూరు, మదనపల్లె:మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన రమణ, సావిత్రి దంపతులకు శిరీషా, జ్యోత్స ఇద్దరు కుమార్తెలు. రమణ వ్యవసాయం చేస్తుండగా, సావిత్రి నిమ్మనపల్లెలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. పెద్ద కుమార్తె శిరీషా. చిన్నప్పటి నుంచి ఈమె చదువులో మెరిక. ఈ క్రమంలో ఎంటెక్ పూర్తి చేసింది. అదే ఏడాది ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి, ఉద్యో గం సాధించింది. మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తోంది.
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
2017లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన అన్ని ఉ ద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసింది. ఫిబ్రవ రి, ఏప్రిల్‌లో రాసిన పరీక్షల్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్, డిస్ట్రిక్ట్ హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్‌మెంట్ విభాగాల్లో ఏఈ పోస్టులు, జెన్‌కో ఏఈ గా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాజాగా 2018 జనవరిలో జరిగిన గ్రూప్స్ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది.
జన్మభూమిపై మమకారంతో..
కడప గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో జిల్లా అధికారిగా నెలపాటు ఉద్యోగం చేసిన శిరీషా జన్మభూమిపై మమకారంతో ఆ ఉద్యోగాన్ని వ దులుకుని, మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్వి రాన్‌మెంట్ ఏఈగా పనిచేస్తోంది.
మా నాన్నే నాకు స్ఫూర్తి....
ఆడపిల్లల చదువులకు ఎందుకు అన్న బంధువులు మాటలు వినకుండా, పిల్లలే నా సర్వస్వం అనుకున్నాడు మా నాన్న. మా ఉన్నతి చూసి మురిసిపోయిన మా నాన్నే నాకు స్ఫూర్తి. – శిరిషా
Comments
Please login to add a commentAdd a comment