ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు షాక్‌ | Shock to the Chinarajappa about Kakinada Corporation Election | Sakshi
Sakshi News home page

ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు షాక్‌

Published Sat, Aug 19 2017 1:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు షాక్‌ - Sakshi

ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు షాక్‌

కాకినాడ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించిన చంద్రబాబు  
కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యతల నుంచి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను సీఎం చంద్రబాబు తప్పించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 48 డివిజన్ల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బాబు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులెవరూ బరిలో లేరు. సీట్ల కేటాయింపులో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కిమిడి కళావెంకట్రావు ముఖ్య భూమిక వహించారు.

కాకినాడలో చంద్రబాబు సామాజిక వర్గం ఓటర్లు తక్కువగా ఉండటంతో ఆ వర్గానికి సీటు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఎం సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత జరిగిన చర్చల్లో చినరాజప్ప సీఎం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కాకినాడ ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement