Kakinada Corporation Election
-
మిత్రమా... వెన్నుపోటే..!
మిత్ర ధర్మం పాటిస్తూ మా వాళ్లంతా మౌనం వహిస్తున్నారు. బీజేపీ చర్యలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం మిత్రధర్మం పాటించడం లేదు. ఇది చాలా బాధాకరం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మాటలు వింటుంటే నిజమే... సత్య హరిశ్చంద్రుడికి నారావారే వారసుడే మోనన్న రీతిలో నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ జిల్లా వాసులు మాత్రం ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే జిల్లాలో ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. బీజేపీకి 9 డివిజన్లను పొత్తులో భాగం గా ప్రకటించడంతో సంబంధిత వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వారికి మద్దతు ఇవ్వాల్సిన టీడీపీ లోపాయి కారీగా రెబెల్స్‌ను నిలబెట్టి బీజేపీ అభ్యర్థులను ఓడించింది. అంతేకాదు కేంద్ర పథకాలకు ‘పచ్చ’ రంగేసి తమవిగా ప్రచారం చేసుకుంటోంది. అడుగడుగునా అణగదొక్కి మిత్రులను అవమానాలపాల్జేస్తుంది. అదెలా అంటే... సాక్షి ప్రతినిధి, కాకినాడ: అడుగడుగునా తూట్లు పొడుస్తూ మిత్రపక్ష ధర్మానికి ద్రోహం చేస్తున్న టీడీపీ వైఖరిపై జిల్లా బీజేపీ క్యాడర్ కన్నెర్ర చేస్తోంది. బీజేపీని ఎదగనివ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. పసుపు కండువా వేసుకుంటే ఏ ఫలమైనా అందుతుందని, స్వపక్షానికే పెద్దపీట వేస్తూ ‘పచ్చ’పాతం పాటిస్తున్నారని, చివరకు కేంద్ర పథకాల్లో కూడా భాగస్వామ్యం కల్పించడంలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పథకాలకు కూడా ‘చంద్రన్న’ పేరు పెట్టుకుని, మోదీ ఫోటో లేకుండా, వాటికి పసుపు రంగు పూసి అవన్నీ తమ ఘన కార్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడాన్ని ఈ వర్గం తప్పు పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలని వీరు చెబుతున్నారు. బీజేపీ పోటీ చేసిన వార్డుల్లో టీడీపీ నేతల్ని రెబల్‌గా వేయించారు. వారిపై సస్పెన్షన్ వేటు వేయకుండా ఎన్నికల తర్వాత తమవారంటూ తమలో కలిపేసుకున్నారు. పథకాలు హైజాక్... కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో 160 పథకాలు అమలవుతున్నాయి. 80 శాతం నిధులు కేంద్రం భరిస్తుండగా, 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో ఎక్కడా 20 శాతం నిధులి చ్చి 100 శాతం పనులు పూర్తి చేసిన దాఖలాల్లేవు. కేంద్రమిచ్చే 80 శాతం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తోంది. అంతటితో ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకోవడం మరీ విడ్డూరం. ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు ఫొటోలతో ‘షో’ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా చంద్రన్న బాట, చంద్రన్న బీమానే తీసుకోవచ్చు. ఇక, పేరు మార్చి అమలు చేస్తున్న వాటిలో ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలకు పసుపు రంగు పూస్తున్నారు. చంద్రన్నబాటలో వేస్తున్న సీసీ రోడ్ల వివరాలను ప్రదర్శించే బోర్డుల్ని పసుపు రంగుతో తయారు చేశారు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులైతే గతంలో ఉన్న రంగు తీసేసి పసుపు రంగు పూశారు. మోదీ ఫొటో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆలయ కమిటీల్లోనూ మొండిచేయి... మిత్రపక్షమైన బీజేపీకి ఆల య కమిటీల్లో చోటు కల్పి స్తూ ఆ పార్టీ నేత, మం త్రి మా ణిక్యాలరావు ఉత్తర్వులు జారీ చేశా రు. కా నీ, కాకినాడకొచ్చేసరికి స్థానిక ఎ మ్మెల్యే వారిచేత ప్ర మాణ స్వీకారం చే యించకుండా అడ్డుతగిలారు. కాకినాడ నగరంలోని బాలా త్రిపుర సుందరి సమేత రా మలింగేశ్వర స్వామి దేవస్థానం లో బీజేపీ నాయకుడు కర్రి పాపారావుకు, జగన్నాథపురం వెంకటేశ్వర స్వా మి దేవస్థానంలో బీజే పీ నాయకుడు కొక్కిలగెడ్డ గంగరాజుకు స్థా నం కల్పించినా ఇద్దరి తో ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఇప్పటికీ ఆ ఉత్తర్వులు గాలిలోనే ఉ న్నాయి. కమిటీలోని మిగతా సభ్యులుగా ఉన్న టీడీపీ నాయకులు మాత్రం ఆలయాల్లో పెత్తనం చెలా యిస్తున్నారు. బీజేపీ నేతలు సిఫార్సు చేసి న వారికి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఇళ్లు కూడా మంజూరు చేయలే దు. సాక్షాత్తు ఆ పార్టీ ప్రజాప్రతినిధి ఒక రు తమ వ్యక్తికి ఇళ్లు మంజూరు చేయాలని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు సిఫార్సు చేస్తే కనీ సం పట్టించుకోలేదు. సరికదా టీడీపీ కం డువా వేసుకుంటేనే ఇళ్లు ఇస్తామని సదరు వ్యక్తికి నిర్మొహమాటంగా చెప్పేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి షాక్... కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని టీడీపీ నాయకులు మోసం చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి 9 డివిజన్లు కేటాయించారు. కానీ ఒక్క డివిజన్లో తప్ప ఎనిమిది డివిజన్లలో టీడీపీ నాయకుల్ని రెబల్‌గా బరిలోకి దించారు. రెబల్స్‌గా ఉన్న వారంతా పసుపు చొక్కాలు వేసుకుని ప్రచారం చేయాలని, ఎన్నికల్లో అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అడిగినంత సొమ్ము అందిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. అంతటితో ఆగకుండా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఏకంగా రెబల్స్ తరపున ప్రచారం కూడా చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ నాయకులను సస్పెండ్ చేస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చారు. కానీ పోలింగ్ జరక్కముందే బీజేపీకి ఝలక్ ఇచ్చారు. సస్పెన్షన్ గాలికి... రెబల్స్‌కు పార్టీలో రెడ్ కార్పెట్... బీజేపీకి కేటాయించిన డివిజన్లలో రెబల్‌గా పోటీ చేసిన వారందరిపైనా సస్పెన్షన్ వేటు వేస్తామని పొత్తు చర్చల్లో టీడీపీ అధిష్టానం దూతలు హామీ ఇచ్చారు. రెబల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని, వారిని పార్టీలోకి ఆహ్వానించేదిలేదని ప్రగల్భాలు పలికారు. కానీ...ఫలితాలొచ్చాక, గెలిచిన 29వ డివిజన్ రెబల్ వాసిరెడ్డి రామచంద్రరావు, 35వ డివిజన్ రెబల్ బలవూరి రామకృష్ణ, 39వ డివిజన్ రెబల్ మల్లిపూడి నాగ సూర్య దీపికలను అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీకి వెన్నుపోటు పొడిచిన విషయాన్ని పక్కన పెట్టి రెబల్స్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇవన్నీ మిత్ర ధర్మాన్ని విస్మరించారనడానికి ఉదాహరణలని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నా చెప్పుకోవడానికి ఏమీ కనబడటం లేదు. తాజాగా కేంద్ర బడ్జెట్‌పై వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొత్తానికి బీజేపీని ఎదగనివ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందనడానికి పైన పేర్కొన్నవన్నీ అక్షర సత్యాలే. వీరి మధ్య కొనసాగుతున్న కలహాల కాపురం ఇంకెంత కాలం పొసగుతుందో చూడాలి. -
మేయరైతే మేయవచ్చు!
♦ ఆశావహులకు సంకేతాలిస్తున్న టీడీపీ అధిష్టానం ♦ ఎవరెక్కువ ముట్టజెబితే వారికే పీఠం ♦ నష్టమేమీ ఉండదని పరోక్ష సంకేతాలు ♦ స్మార్ట్‌సిటీ నిధులతో ‘లాభసాటి’ అని భరోసా ♦ జోరందుకున్న పైరవీలు ‘మేయర్ పీఠం కొనుక్కోండి అడ్డంగా మేసేయండి’ ఇదీ టీడీపీ అధిష్టానం పార్టీ ఆశావహులకు ఇస్తున్న పిలుపు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి ఆ పార్టీలో మేయర్ పీఠం కోసం పోటీ నెలకొంది. గట్టిగా పోటీ పడుతున్న నలుగురిలో ఎవరు ఎక్కువ సొమ్ములిస్తే వారికే పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్న అధిష్టానం వారు తిరిగి సొమ్ము రాబట్టుకొనే విధానం కూడా సూచిస్తుండడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, కాకినాడ : మొన్నటి వరకు ఎవరు గెలుస్తారనేదానిపై చర్చ ... ఇప్పుడు ఎవరు మేయర్ అవుతారన్న దానిపై టీడీపీలో జగడం మొదలైంది. నలుగురు పోటీ పడుతుండటంతో మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొంది. ఎవరెక్కువ ముట్టజెబితే వారికే మేయర్ పీఠం కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం చూస్తోంది. అందువల్ల నష్టపోయేదేమీ లేదని...స్మార్ట్ సిటీ నిధులు దండిగా వస్తాయని...అందులో దండుకోవచ్చునని పరోక్ష సంకేతాలు కూడా పంపిస్తోంది. దీంతో మేయర్ పదవి దక్కించుకునేందుకు అశావహుల పైరవీలు ఊపందుకున్నాయి. పోటీలో ఆ నలుగురు మేయర్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ సుంకర పావని, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న, 38వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, 8వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి ఆశిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో నేత తెరవెనుక అండగా నిలుస్తున్నారు. సుంకర శివప్రసన్నకు మంత్రి యనమల అండదండలుండగా, సుంకర పావనికి ఎంపీ తోట నర్సింహంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తున్నారు. మాకినీడి శేషుకుమారికి మంత్రి నారాయణ వెన్నుదన్నుగా నిలువగా, అడ్డూరి వరలక్ష్మికి స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మద్దతిస్తున్నారు. దీంతో ఎవరికి వారు పైరవీలకు శ్రీకారం చుట్టారు. ఖర్చుకు వెనుకాడని ఆశావహులు... హాట్‌కేకులా తయారైన మేయర్ పీఠంపై ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకసారి మేయర్ కుర్చీపై కూర్చొంటే చాలని కొందరు...పదవి వచ్చాక ఖర్చు పెట్టిందంతా రాబట్టుకోవచ్చన్న ఆలోచనతో మరికొందరు ఎవరిదారిలో వారు పోటీ పడుతున్నారు. అభ్యర్థులు గెలిచేందుకు ఎంతో ఖర్చు పెట్టాం...ఇప్పుడు అందులో కొంతైనా మేయర్ పదవి బూచిగా చూపించి రాబట్టుకోవాలని రాష్ట్ర పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓటుకి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు పెడితేనే గెలవగలిగామని, ఆ స్థాయిలో చేసిన ఖర్చులో కొంతైనా రికవరీ చేయాలని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఈ పథక రచనకు దిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కోట్ల రూపాయల సీటు పందెంలో ఎవరిది పైచేయో వేచి చూడాల్సిందే....! -
విజేతలెవరో..!
-
పటిష్ట బందోబస్తు
కాకినాడ క్రైం : కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 318 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కూడా ర్యాలీలు నిర్వహించరాదని, పరాజయం పాలైన అభ్యర్థులు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్ప డరాదన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు, తగాదాలు జరక్కుండా పోలీసు బలగాలతో మందస్తు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఐదుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 75 మంది ఏఎన్ఎస్ సిబ్బంది, 196 మంది హెచ్‌సీలు , కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తులో జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజినల్ అధికారులతోపాటు పలువురు సీఐలు విధులు నిర్వహిస్తారన్నారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణలోకి కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, అభ్యర్థులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం ఐటీఐ గ్రౌండ్, ఎగ్జిబిషన్ స్థలంలో ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు జరక్కుండా నగర శివారు, ప్రవేశ ద్వారాల్లో ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి యుత వాతావరణంలో ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు సబ్ డివిజినల్ అధికారులు,పలువురు సీఐలు పాల్గొన్నారు. -
విజేతలెవరో..!
♦ అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే ♦ ఎన్నికల కౌంటింగ్‌కు 14 టేబుళ్ల ఏర్పాటు ♦ జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ ♦ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం ♦ ప్రత్యేక స్క్రీన్ల ఏర్పాటు ♦ 12లోపు మొత్తం పూర్తి ఫలితాలు వెల్లడి కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 48 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 14 టేబుల్స్ ఏర్పాటు... కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, అదనపు కౌంటింగ్ సూపర్వైజర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 60 మందికిపైగా కౌంటింగ్ సిబ్బంది విధి నిర్వహణకు నియమించారు. ప్రతి టేబుల్ వద్ద ఏజెంట్లు ఉండేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తం 21 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 7.30 గంటలకు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లను తెరుస్తారు. ఈవీఎంలను బయటకు తెచ్చి 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, కమిషనర్ అలీమ్ బాషా, అబ్జర్వర్ కె.వి.రమణ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ వద్ద డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, ఆర్డీవో ఎల్.రఘుబాబు, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం మరికొంతమంది అధికారులను కూడా ప్రత్యేక పర్యవేక్షణ కోసం నియమించారు. స్క్రీన్ల ఏర్పాటు... కౌంటింగ్ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. మీడియా కోసం ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లోకి అనుమతించే విషయంలో కూడా నిబంధనలు రూపొందించారు. ఏర్పాట్ల పరిశీలన... కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ కార్తికేయమిశ్రా గురువారం పర్యవేక్షించారు. కౌంటింగ్ జరిగే రంగరాయ మెడికల్ కళాశాల ఎగ్జామ్ హాలును ఆయన పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా తరగతులను కూడా సందర్శించి పలు సూచనలిచ్చారు. ఈవీఎంలలోని ఫలితాల నమోదు, కంప్యూటరీకరణ, ఎన్నికల ఫలితాల ప్రకటనలో అనుసరించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను ఆయన సిబ్బందికి వివరించారు. 12 గంటలలోపే అన్ని డివిజన్ల ఫలితాలు... కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలలోపే వెలువడే అవకాశం ఉందని కలెక్టర్ మిశ్రా చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు ఉద్యోగుల ర్యాండమైజేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. 7 గంటలకు రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరుస్తామన్నారు. 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ 12 గంటలకు ముగిసే అవకాశం ఉంటుందన్నారు. అమలులో ప్రవర్తనా నియమావళి... ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని కలెక్టర్ మిశ్రా చెప్పారు. నిబంధనల మేరకు ఆయా రాజకీయ పార్టీల నేతలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు వీలుగా పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. విజేతలెవరో...? కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి బయటపడనున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పక్షాల అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారున్నారు. గెలుపుపై ప్రధాన పక్షాలైన టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధనప్రభావంపై విస్తృత చర్చ... కార్పొరేషన్ ఎన్నికల్లో మున్నెన్నడూ లేనంతగా సాగిన ధన ప్రవాహంపై ఇప్పుడు అన్ని వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. అనే డివిజన్లలో పెద్ద మొత్తంలో డబ్బు, మద్యంతోపాటు అధికార పార్టీ కానుకలు కూడా ఇచ్చి ప్రలోభాలకు తెరదీసిన నేపథ్యంలో ఈ ప్రభావం ఎన్నికలపై ఏ స్థాయిలో ఉంటుందనే అంశంపై మేధావుల్లో చర్చకు దారితీసింది. టి.డి.పి. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి స్వతంత్ర అభ్యర్థులను కొనుగోలు చేసి, ఓటర్లకు డబ్బు ఎరగా వేసి, రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఖరీదైన ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
‘కార్పొరేషన్’ తీర్పు... 24 గంటలే
♦ గెలుపు ఓటములపై ఎవరి ధీమా వారిది ♦ కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు కాకినాడ : ఈవీఎంలలో నిక్షిప్తమైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ల తీర్పు మరో 24 గంటల్లో బయటకు రానుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సెప్టెంబర్ 1వ తేదీన జరిగే కౌంటింగ్‌పైనే అందరి దృష్టి పడింది. 48 డివిజన్లకు సంబంధించి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళి ఆధారంగా అభ్యర్థులు గెలుపు ఓటములపై కూడికలు, తీసివేతల్లో పడ్డారు. ఏ డివిజన్లలో ఎంత శాతం పోలైంది? ఆ డివిజన్లలో ఏ వర్గం ప్రతిస్పందన ఏమిటి? ఓటర్ నాడి ఎలా ఉంది? వంటి అంశాలపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్న అనుచరులు, ఇతర సిబ్బందిని కూడా ప్రజాస్పందనపై ఆరా తీయడంలో మునిగిపోయారు. ఓటింగ్ సరళి ఆధారంగా ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది? ఎక్కడ ప్రతికూలంగా ఉంటుంది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఎవరి ధీమా వారిది... గెలుపుపై అభ్యర్థులు ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి తమకే అవకాశాలున్నాయంటే ... తమదే విజయమంటూ ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి కూడా తమకే అనుకూలంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికపై ఆరా... కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ నివేదికపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఇప్పటికే ఓ రిపోర్టును ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ డివిజన్ ఏ పార్టీ ఖాతాలో వేశారనే అంశంపై అభ్యర్థులు ఆసక్తితో సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఓటరు తీర్పు ఎటువైపు? కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు ఎటువైపు మొగ్గారనే అంశంపై ఆసక్తి నెలకొంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ, అధికార దుర్వినియోగం, ఓటర్లకు బెదిరింపులు, ప్రలోభాల నేపథ్యంలో వీరి నిర్ణయం ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని డివిజన్లలో చివరి మూడు రోజులుగా డబ్బుతోపాటు కానుకలు కూడా పంపిణీ చేశారు. ఏది ఏమైనా మరో 24 గంటల్లో రానున్న ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
కాయ్ రాజా కాయ్
♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు ♦ లక్షల్లో కాస్తూ సై అంటే సై... ♦ 30వ డివిజన్ ఫలితంపై రెట్టింపు సంఖ్యలు ♦ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ‘పోటీ’దారులు కాకినాడ క్రైం : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగియడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీ కోట్లాది రూపాయలను తృణప్రాయంగా ఖర్చు చేసింది. ఎన్నడూలేని రీతిలో ఎన్నికలకు రెండు రోజుల ముందే ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బులు పంచి ఓటర్లను పలు ప్రలోభాలకు గురిచేశారు. మద్యాన్ని వరదలా పారించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు పార్టీ అధినేత జగన్ పర్యటనతో రెట్టించిన ఉత్సాహంతో విజయం కోసం అహర్నిశలూ శ్రమించారు. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగినా మొత్తంమీద ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులకు తెరదీశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుపై జోరుగా పందేలు కడుతున్నారు. వేల నుంచి లక్షల రూపాయల మేర పందాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ డివిజన్ వైపే చూపంతా... కాకినాడ డివిజన్ పరిధిలోని 30వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాదం బాలకృష్ణల మధ్య ఎన్నికల ఫలితంపై జోరుగా పందేలు సాగుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి బాలకృష్ణ గెలుపు కోసం ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వైఎస్పార్సీపీ అభ్యర్థిని తరపున మాజీ ఎమ్మెల్యే, సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అభ్యర్థిని భర్త ప్రూటీకుమార్ విస్త్రుత ప్రచారం నిర్వహించారు. అధినేతలంతా ఇక్కడే... ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడాయి. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఒకరోజు కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పలువురు వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్పరిధిలో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా విలీన పంచాయతీలపై కొంత మంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో రెండు డివిజన్లను మినహాయించి 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ సరళి, పోలైన ఓట్లు, ఏ వర్గం ఓట్లు తమకు అనుకూలంగా పడ్డాయి, ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయనే విషయంపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మరో రోజులో తేలే ఎన్నికల ఫలితాల కోసం ఇటు అభ్యర్థులతోపాటు అటు పార్టీశ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఎన్నికల వేళ...కోడ్ ఉల్లంఘించి..
కాకినాడ : ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న 32, 33 డివిజన్ల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికార గర్వానికి మంగళవారం సాయంత్రం రామకృష్ణారావుపేటలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత 33వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి వర్గీయులు, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య చోటు చేసుకున్న పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంపై ఎమ్మెల్యే కొండబాబు అక్కడికి చేరుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బెదిరించే ధోరణిలో మాట్లాడే లోపు సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అక్కడికి చేరుకుని ఇరువర్గీయులను సముదాయిస్తుండగా ఎమ్మెల్యే కొండబాబు 33వ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. ఆయనతో పాటు ద్వారంపూడి కూడా బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిçస్తుండగా పోలీసులు లోపలికి వెళ్లేది కుదరదంటూ ద్వారంపూడిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించి లోపలకి వెళ్లొచ్చా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా అక్కడి పోలీసులు ఎమ్మెల్యే కొండబాబును వెనక్కి రప్పించారు. దీంతో వెనుదిరిగినా ఆయన అక్కసుతో 32వ డివిజన్లోని పోలింగ్ బూత్‌కు వెళ్లారు. ద్వారంపూడి ఇక్కడ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే కొండబాబు పోలీసుల సమక్షంలోనే బూత్ లోపలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త సైదులను కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ద్వారంపూడి మళ్లీ అక్కడకు వచ్చేలోపు ఎమ్మెల్యే కొండబాబు జారుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగడంతో డీఐజీ రామకృష్ణ, ఎస్పీ విశాల్ గున్నీ, డీఎస్పీలు సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే చేసిన ఘాతుకంపై పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. -
దేశం తీరు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం
♦ ప్రస్తుత ఎన్నికల్లో దిగజారి వ్యవహరించిన టీడీపీ ♦ కోట్లు కుమ్మరించి అధికార దుర్వినియోగం ♦ వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబు, బోస్ కాకినాడ : నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికార టీడీపీ వ్యవహారశైలి చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదంగా కనిపిస్తోందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి వీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసుశాఖను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీతోపాటు అడ్డుపడిన వైఎస్సార్సీపీ నేతలపై ఎదురుదాడికి దిగి తప్పుడు కేసులు బనాయించిన తీరుచూస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ ఎంత పతనావస్థకు చేరిందో అర్థమవుతోందన్నారు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా గెలవడమే ప్రధానమన్న ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు వ్యవహరించారన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఇంటిలిజన్స్ అధికారులు కూడా ఇక్కడే తిష్టవేసి ప్రతికూలంగా ఉన్న ప్రాంతాలపై ఇచ్చిన నివేదికలు ఆధారంగా ప్రలోభాలకు తెరతీశారని విమర్శించారు. గతంలో ఏ పార్టీ కూడా ఇంతగా దిగజారిన పరిస్థితిని చూడలేదని కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే బీజేపీతో ఉన్న అనుబంధం తెగిపోతుందన్న భయంతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు. మేథావులు సైతం టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇందుకు కాకినాడ ఎన్నికల్లో నమోదైన ఓట్ల శాతమే నిదర్శనమన్నారు. నంద్యాలలో ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన అధికార పార్టీ నేతలు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అంతకన్నా ప్రమాదకరంగా ఉందన్నారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి విధానాలకు ఇకనైనా స్వస్తిపలకాలని హితవు పలికారు. లేని పక్షంలో సామాన్యుడు రాజకీయాల్లో మనుగడసాధించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. అడుగడుగునా ప్రలోభాలు కార్పొరేషన్ ఎన్నికలు సందర్భంగా అడుగడుగునా ప్రలోభాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. కొంత మంది పోలీసు సిబ్బంది దగ్గరుండి మరీ టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించిన సంఘటనలు ఎదురయ్యాయన్నారు. అనేక ప్రాంతాల్లో తమ పార్టీ ఏజెంట్లను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో మండపేట, రాజమహేంద్రవరం, ముమ్మిడివరం, కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గిరిజాల బాబు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు. మిండకుదిటి మోహన్, తాడి విజయభాస్కరరెడ్డి, పార్టీనేతలు కుప్పాల వాసుబాబు, పేర్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు మాయం
♦ ‘సాక్షి’ ముందే చెప్పింది ♦ ఒక్కో డివిజన్లో ఐదు నుంచి పదిశాతం గల్లంతు ♦ పట్టించుకోని యంత్రాంగం పోలింగ్‌శాతంపై ప్రభావం ♦ 64.78 శాతం మాత్రమే నమోదు ♦ ఆందోళనలో అభ్యర్థులు కాకినాడ : భార్యకు ఓటు ఉంటే.. భర్తకు లేదు. కుమారుడికి ఓటు ఉంటే తల్లికి లేదు. ఎన్నో ఎన్నికల్లో ఓటు వేసిన వయోవృద్ధులు ఈసారి ఓటుహక్కును వినియోగించులేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో డివిజన్ పరిధిలో ఐదు నుంచి పదిశాతం ఓట్లు గల్లంతయ్యాయి. ఈ విషయమై ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. నగర పౌరులు పూర్తిస్థాయిలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా ఎంతోమంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండానే నిరాశతో వెనుతిరిగాల్సి వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు జాబితాలు గందరగోళంగా తయారయ్యాయి. ఒక ఇంటిలో నలుగురు ఓటర్లుంటే ఇరువురికి మాత్రమే ప్రస్తుత జాబితాలో ఓటు ఉండడం, మిగిలిన వారి పేర్లు లేకపోవడం, జాబితాలో పేరున్నా డోరు నంబర్లు మారిపోవడం తదితర కారణాలతో వందలాది మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కో డివిజన్లో ఐదు నుంచి పదిశాతం వరకు ఓట్లు ఈ విధంగా గల్లంతయ్యాయి. ఈ విషయమై ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. సమస్యను పరిష్కరించే దిశగా అధికార యంత్రంగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాలో సరిచూసుకునే వెసులుబాటు కల్పించలేదు. అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలే దిక్కయ్యాయి. జాబితాల్లో తప్పులపై సమాధానం చెప్పే నాథులు కరువయ్యారు. దీంతో చేతిలో ఓటరు కార్డు ఉన్నా ఓటు వేసే వీలులేకపోవడంతో నగర పౌరులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మూడు పర్యాయాలుగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని, డోర్ నంబరు మార్పు చేయడంతో ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నానని రెండో డివిజన్‌కు చెందిన ఎస్.నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు మాత్రమే ఓటు ఉందని, తనకు మాత్రం రాలేదని ఐదో డివిజన్‌కు చెందిన వి. శ్రీనివాసరావు వాపోగా, 20 ఏళ్లుగా ఉన్న ఇంటి డోర్ నంబరు ఇప్పుడు మార్చేశారని ఓటే వేసే వీలులేకపోయిందని 26వ డివిజన్‌కు చెందిన దుర్గ తెలిపింది. పోలింగ్ స్టేషన్ల వద్ద సవరణ జాబితాలు ఏర్పాటుచేయలేదని పలువురు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ల పరిధిలోని ప్రాంతాలను మార్పు చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జాబితాలు సరిచేసినప్పుడు సాంకేతిక లోపాలు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడానికి కారణమై ఉండవచ్చునంటున్నారు. నగరంలో దాదాపు 20 వేలకు పైబడి ఓట్లు గల్లంతై ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలింగ్‌పై ప్రభావం.. ఆందోళనలో అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో ఓట్లు గల్లంతవ్వడం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. 48 డివిజన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 2,29,373 మంది ఉన్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్ది ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారో ఏజెంట్లు ద్వారా సమాచారం తెప్పించుకుని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించి పంపేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఆయా కారణాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైబడి పోలింగ్ జరుగుతుంది. కాగా కేవలం 64.78 శాతం మాత్రమే ఓట్లు పోలవ్వడం గమనార్హం. 1,48,598 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమను బలపరుస్తారని భావించిన పలువురి ఓటర్లకు సంబంధించి జాబితాలో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జాబితాలో తప్పులు కారణంగా తమకు సానుకూలమైన ఓట్లు కోల్పోయామని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. -
ఆద్యంతం..పచ్చందారీతనమే..
కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ చివరి వరకు అధికార పార్టీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేసింది. అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ నేతలు దాదాగిరీ ప్రదర్శించారు. ప్రత్యర్థులను బెదిరించారు. ‘నీ సంగతి చూస్తానంటూ’ ఒకరు, ‘డబ్బు పంపిణీని అడ్డుకుంటారా’ అని మరికొందరు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లో ప్రచారమేంటని అడిగినందుకు మరికొందరు రౌడీయిజానికి దిగారు. టీడీపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు (కొండబాబు) తన సహజ శైలిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై అంతెత్తున లేచారు. మొత్తానికి టీడీపీ నేతల దౌర్జన్యాల మధ్య కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అధికార పార్టీ ఆగడాలను పోలీసులు అడ్డుకోలేకపోయారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆద్యంతం ‘పచ్చ’ం దారీతనమే పెత్తనం చెలాయించింది. పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు చెలరేగి పోయారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ప్రచారం చేయడమే కాక అడ్డొచ్చిన ప్రతిపక్ష నాయకులపై దాదాగిరీ ప్రదర్శిం చారు. ‘నాలుగైతే నీగతి చూస్తా’నంటూ 14వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి అంకాడి సత్తిబాబును హెచ్చరించారు. ఇక్కడొకచోటే కాదు ఆయన వెళ్లిన ప్రతి చోటా వివాదమే. 32, 33 డివిజన్ల్లో సిటీ ఎమ్మెల్యే öండబాబు దూకుడుతో మంగళవారం సాయంత్రం రామకృష్ణారావుపేటలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత 33వ డివిజన్లో టీడీపి అభ్యర్థి వర్గీయులు, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంపై వివాదం జరగ్గా ఎమ్మెల్యే కొండబాబు అక్కడకు చేరుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బెదిరించే ధోరణిలో మాట్లాడారు. వనమాడి వెర్సెస్ ద్వారంపూడి ఎమ్మెల్యే కొండబాబుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్పార్ సీపీæ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దీటుగా బదులిచ్చారు. ఆయన ఇరువర్గీయులను సముదాయిస్తుండగా ఎమ్మెల్యే కొండబాబు 33వ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళారు. దీంతో ద్వారంపూడి బూత్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిçస్తుండగా పోలీసులు కుదరదంటూ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించి లోపలకి వెళ్లొచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు ఎమ్మెల్యేను వెనక్కి రప్పించారు. దీంతో వెనుదిరిగిన ఆయన అక్కసుతో 32వ డివిజన్లోని పోలింగ్ బూత్‌కు వెళ్ళారు. ఇక్కడ బూత్ లోపలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త సైదులును ఎమ్మెల్యే కొండబాబు పోలీసుల సమక్షంలోనే కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ద్వారంపూడి మళ్ళీ అక్కడకు వచ్చేలోగానే ఎమ్మెల్యే కొండబాబు జారుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగడంతో డీఐజీ రామకృష్ణ, ఎస్పీ విశాల్ గున్ని, డీఎస్పీలు సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ద్వారంపూడి విలేకరులతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే చేసిన ఘాతుకంపై పోలీస్ ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పోలీసులను నిలదీసిన ద్వారంపూడి కార్పోరేషన్ పరిధిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే కొండబాబు ప్రవేశించి ఓటర్లను ప్రలోభ పెట్టటంపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే సుమారు పావుగంట సేపు పోలింగ్ కేంద్రంలోనే ఉండడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి వెంకటలక్ష్మి ఈ విషయాన్ని పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు వచ్చి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినట్లు తెలిపారు. ‘ఓటేయకుంటే పింఛన్లకు చేటు..’ 37వ డివిజన్ ఫ్రేజర్‌పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వృద్ధులు, వికలాంగులను తమ పార్టీకి ఓట్లు వే యాలని లేని పక్షంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుని పింఛన్లతో పాటు ప్రభుత్వ పథకాలు ఏమీ రాకుండా చేస్తామంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఒకానొక సమయంలో తెలుగుతమ్ముళ్లు మంద బలాన్ని ఉపయోగించి పోలింగ్ కేంద్రం బయట ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. పోలింగ్ బూత్‌లను అడిషనల్ ఎస్పీ దామోదర్, సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన వాహనాలను టీడీపీ, బీజేపీ నేతలు పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడంతో వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు యథేచ్ఛగా లోనికి ప్రవేశించగా వారిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నామమాత్రంగా బెదిరించారు తప్ప వారిని ఏమీ అనలేక పోయేవారు. అధికారంలో ఉన్నాం ఏమైనా చెయ్యగలమంటూ టీడీపీ నాయకులు అసభ్యపదజాలంతో వైఎస్సార్ సీపీ వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వారు ఎంత రెచ్చగొట్టినా పోలింగ్ ప్రశాంతంగా జరగాలంటూ వారితో పాటు పోలీసులను సముదాయించడంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. లేనేలేని డోర్ నంబర్లో 40ఓట్లు 43 డివిజన్లోని బాలయోగి వీధిలో 64–16–40 డోర్నెంబర్లో 40 ఓట్లు ఉన్నాయి. వాస్తవానికి అక్కడ ఆ డోర్ నెంబర్ లేనేలేదు. అధికారి పార్టీ అభ్యర్థి పక్కా ప్రణాళిక ప్రకారం ఆ డివిజన్లో స్థానికేతరులకు ఓట్లు నమోదు చేయించారు. ఎన్నికలు నిర్వహించే ముందు కార్పొరేషన్ అధికారులు ఓటరు లిస్ట్ అభ్యంతరాలు తీసుకొనే సమయంలో ఈ డోర్ నెంబర్లో ఓట్లు లేవు. ఎన్నికలకు సిద్ధమైన తర్వాత అభ్యర్థులకు ఇచ్చిన ఓటర్ల జాబితాకు అదనంగా 40 ఓట్లతో వేరే పేజీ జత చేశారు. ఈ విషయాన్ని అక్కడ పోటీ చేసిన వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అభ్యర్థి కోకా వెంకటగిరి, స్వతంత్ర అభ్యర్థి నమ్మి సత్యవాణి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికేతరులు ఓట్లు వేసేందుకు రావడంతో పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. వారిది ఈ ప్రాంతమే కాదని ఓట్లు వేయనిచ్చేది లేదని పట్టుపట్టారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరుపార్టీలకు చెందిన వారు గుంపులుగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకొనేందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్క డ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేష్ ఎస్పీ విశాల్‌గున్నికి పరిస్థితిని ఫోన్లో వివరించడంతో వెంటనే మొబైల్‌పార్టీ పోలీసులను పంపారు. టీడీపీ అభ్యర్థి జేడీ పవన్‌కుమార్ వారికి ఎందుకు ఓట్లు ఇవ్వరని పోలింగ్ సిబ్బందితో వాగ్వివా దానికి దిగారు. ఎన్నికల జోనల్ అధికారి నారాయణమూర్తి పోలింగ్ కేంద్రానికి వచ్చి, ఇరువర్గాల వాదనలు విన్నారు. వారికి ఓట్లు ఉండి, గుర్తింపు కార్డులు ఉంటే ఓటు వేయవద్దనే అధికారం తమకు లేదన్నారు. దీంతో వారు యథేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు. 4వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన చేశారు. బూత్‌లో డబ్బుల పంపకంతో గలాటా 21వ డివిజన్లో 12.30 గంటల సమయంలో ఓ వ్యక్తి పోలింగ్‌బూత్‌లో నిలబడి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పసిగట్టి గొడవ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరకొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. అధికార పార్టీ పోలీసు వర్గాల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయించడంపై ఇతరపార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి అక్కడనుంచి వెళ్లిపోయాడు. 4.30 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి భర్త పోలింగ్‌బూత్‌లోకి మోటార్‌సైకిల్‌పై రావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి పంపించి వేశారు. 14వ డివిజన్లో ఏటిమొగ అమృతసదన్ పాఠశాలలో టీడీపీ అభ్యర్థి వనమాడి ఉమాశంకర్, కార్యకర్తలతో వచ్చి పోలింగ్‌బూత్ వద్ద ప్రచారం టీడీపీకి ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ వచ్చి టీడీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోలీసులు కూడా అధికారపార్టీ నాయకులకు మద్దతు పలికారు. ఎస్పీ విశాల్ గున్ని, ఉత్తరకోస్తా ఐజీ విశ్వజిత్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీసుల పక్షపాత వైఖరి.. 38వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మాకినీడి శేషుకుమారికి సహకరిస్తున్న కానిస్టేబుల్‌ను వదిలిపెట్టి, వైఎస్సార్సీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ ఒక ఎస్సైని ఆ పోలింగ్ కేంద్రం విధుల నుంచి తొలగించడం విశేషం. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఇరుపార్టీల నాయకులు వంద మీటర్లలోపులో ఉండరాదని ఎస్సై హెచ్చరించారు. ఈ చర్యలను జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎస్సై వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎస్పీ గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ విధుల్లో ఉన ఎస్సైని బయటికి పంపారు. అయితే పోలింగ్ ప్రారంభం నుంచి టీడీపీ నాయకులకు సహకరిస్తున్న ఒక కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు దుయ్యబట్టారు. పోలీసులు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కండువాతో బీజేపీ నేత 39వ డివిజన్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా వచ్చిన ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు మెడలో పార్టీ కండువాను వేసుకోవడం వివాదస్పదమైంది. మెడలో కండువాను తొలగించాలని ఇండిపెండెంట్ అభ్యర్ధి అనుచరులు డిమాండ్ చేశారు. అయితే తాను 200 మీటర్ల దూరంలో ఉన్నానని తాను తీయాల్సిన పనిలేదని చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో అక్కడకు మీడియా చేరుకోవడంతో ఆయన జారుకున్నారు. పచ్చచొక్కాలతో ప్రచారం 35వ డివిజన్ పోలింగ్ జరుగుతున్న కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల పీఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద పచ్చ చొక్కాలు వేసుకుని ఓటర్లను ప్రలోభ పెట్టారు. అది గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారి ప్రచారాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ నాయకులను వారించారు. ఇదిలా ఉండగా ఈ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బలువూరి రామకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలోనే ఉండి ఓటర్లను ప్రలోభపెట్టినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసుల తీరుతో ఓటర్ల బేజారు పోలింగ్ ప్రారంభంలో పోలీసులు అనుసరించిన తీరుతో ఓటర్లు బేజారెత్తారు. ముగ్గురు, నలుగురు కల్సి ఓటువేయడానికి వచ్చినా చెదరకొట్టే ప్రయత్నంచేశారు. టీడీపీ అభ్యర్థులు పోలింగ్ బూత్ వద్ద ఉన్నా పట్టించుకోని పోలీసులు, వైఎస్సార్సీపీ అభ్యర్థులను 100 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పడం కనిపించింది. గంట గడిచేసరికి అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వెనక్కి తగ్గారు. చివరి నిమిషంలో రిగ్గింగ్ యత్నం 49వ డివిజన్లో టీడీపీకి చెందిన కొందరు చివరి నిమిషంలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు సిద్ధం కాగా, వైఎస్సార్ సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు వెళ్లారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా వారు బయటకు వచ్చారు. అయితే అప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్ సమయం ముగిసిందని ప్రకటించారు. 16, 17, 18 డివిజన్లలో పోలింగ్‌బూత్‌ల వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు నిలబడి ఓటర్లను ఓట్లు అభ్యర్థించే విషయమై ఘర్షణ వాతావరణం నెలకొంది. -
కాకినాడ మున్సిపల్ ఎన్నికల పోరు నేడే
-
తమ్ముళ్లలో ‘అన్న’ భయం
► ‘అన్న’ అరాచకాలు దెబ్బతీస్తాయా? ► అన్నింటా తానై దోపిడీ ► ఆదిలోనే అడ్డుకట్ట వేయడంలో విఫలం ► టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్లో ఆందోళన సాక్షి, కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థులకు ఆది నుంచీ అన‘కొండ’ ‘అన్న’ భయం వెంటాడుతోంది. గత మూడున్నరేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా ప్రతినిధి అన్న చేసిన దందాలు, సెటిల్మెంట్లు తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. వీరితోపాటు ఎన్నికలను పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఇన్చార్జీలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు, నాయకులతోపాటు టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజాప్రతినిధి తన అన్నతో నగరంలో లెక్కలేనన్ని సెటిల్మెంట్లు, దందాలు, కబ్జాలకు పాల్పడ్డారని నగర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గుట్కా, మద్యం మాఫీయాకు డాన్‌గా వ్యవహరిస్తుండడంతోపాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ఆస్తి, భూ తగాదాలను రాజీ పేరుతో ‘అన్న’ పరిష్కరిస్తూ ఇరు వైపులా దండుకునేవాడని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా స్టేషన్లలో నమోదయ్యే ఇలాంటి కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం పని చేస్తోంది. ఫిర్యాదు స్వభావం, ఆస్తి విలువ, వ్యక్తుల పూర్వాపరాలు ఈ బృందం సేకరించి ‘అన్న’కు అందజేస్తుంది. అద్దెకున్న వారితోనే సమాచారం అందజేత... ఇంటికి దొంగ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఆ ఇల్లు తాము కొన్నామంటూ ఖాళీ చేయాలని ‘అన్న’ తరఫున వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారికి తాఫీగా చెబుతారు. దీంతో వారు ఇప్పటి వరకు తాము అద్దె చెల్లిస్తున్న వారికి ఓ మాట చెప్పి ఖాళీ చేసేందుకు అద్దెకుంటున్న వారు ఇతర ప్రాంతంలో ఉంటున్న వారికి ఫోన్ చేసి విషయం చెబుతారు. తాము తమ ఇంటిని ఎవరికీ అమ్మకపోయినా ఇలాంటిది ఎందుకు వచ్చిందని వారు కంగారుతో నగరానికి చేరుకుంటారు. ముందుగా సిద్ధం చేసిన ప్లాన్ ప్రకారం సామాన్యులైన వారితో ఆ ఇల్లు తాము కొన్నామంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ రాజీకి వచ్చేలా చూస్తారు. అప్పుడు ‘అన్న’ రంగంలోకి దిగుతారు. ఇరువురినీ పిలిపించి ‘గొడవ ఎందుకు’ అంటూ కొంత మొత్తం అసలు యజమానుల చేత దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తన అనుచరులకు ఇప్పిస్తారు. ఇలా నగరంలో చాపకింద నీరులా అనేక దందాలు, సెటిల్మెంట్లు జరిగాయి. ఎన్నికల నేపథ్యంలో అన్న అరాచకాలు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనన్న భయంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులున్నారు. ‘ఖచ్చితంగా ఆ ప్రభావం ఎంతో కొంత పడుతందని’ ఓ బీజేపీ అభ్యర్థి వ్యాఖ్యానించడం అన్న అరాచకాలపై వారు ఎంత ఆందోళనతో ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పటి వరకు కష్టపడిదంతా తమ తప్పు లేకపోయినా వృథా అవుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. సృష్టించేది.. పరిష్కరించేదీ ఒక్కరే... ప్రజాప్రతినిధి అన్న ఒకే ఆస్తికి పలు రకాల నికిలీ దస్తావేజులు సృష్టించి డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ చేయించి సమస్య సృష్టించి తిరిగి తానే పరిష్కరిస్తూ సెటిల్మెంట్లను కాకినాడ నగరంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చర్చ జరుగుతోంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఓ బృందం ఎల్లప్పుడూ పని చేస్తోంది. నగరంలో ఇళ్లు, స్థలం ఉండి యజమానులు విదేశాలు, లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉంటే ఆ ఆస్తి చిక్కుల్లో ఇరుక్కున్నేట్లే. ‘అన్న’ బృందం ఇలాంటి ఇళ్లు, స్థలాలను, వాటి యజమానులు, వారి పూర్వాపరాల వివరాలు సేకరిస్తారు. మధ్యతరగతి, ఉద్యోగ, రాజకీయ నేపథ్యం లేని వారి ఆస్తికి ‘అన్న’ బృందంలోని వారితోనే నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. -
కాకినాడ నగర పోరు నేడే
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నేడు పోలింగ్ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామగ్రితో అధికారులు, సిబ్బంది 196 పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రెండు రోజులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక రోజు నగరంలో ప్రచారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు సైతం నగరంలో పర్యటించారు. మొత్తం 50 వార్డుల్లో 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగడం లేదు. కాగా ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1వ తేదీన జరగనుంది. -
కొనసాగుతున్న ప్రలోభాల పర్వం
- బహిరంగంగా డబ్బు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు - ఓటు వేశాక మరికొంత ఇస్తామని ప్రచారం - పేదల బస్తీల్లో విచ్చలవిడిగా మద్యం సరఫరా - చోద్యం చూస్తున్న పోలీసులు కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఆదివారం కూడా యథేచ్ఛగా కొనసాగింది. సాయంత్రానికి ప్రచార పర్వం పరిసమాప్తమయ్యాక ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా అధికార టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పోలీసులు మిన్నకుండిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో చోటా మోటా నాయకులు బహిరంగంగానే స్లిప్పుల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. పేదల బస్తీలలో మద్యం పంచుతున్నారు. మహిళల్ని ఆకర్షించేందుకు ముక్కు పుడకలు, కుంకుమ భరిణెలు, చీరెలు, జాకెట్ ముక్కల్ని ఎర వేస్తున్నారు. డబ్బు పంచుతున్న వారిని వైఎస్సార్ సీపీ నాయకులు పట్టిచ్చినా పోలీసులు కాసేపు స్టేషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నగరంలోని పలు ప్రాంతాల్లో మకాం వేసి డబ్బు, మద్యం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. తొలి విడత డబ్బు తీసుకున్న వారు పోలింగ్ జరిగే మంగళవారం స్లిప్పులు చూపించి మలి విడత సొమ్మును తీసుకు వెళ్లవచ్చని పోటీలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన అనుచరులు ప్రచారం ముగిసిన తర్వాత కూడా పేదల బస్తీల్లో వాహనాల్లో తిరుగుతూ డబ్బు, మద్యం పంచడం వివాదాస్పదమైంది. కాకినాడ మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇస్తాం.. కాకినాడ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్ జనం సాక్షిగా ప్రకటించారు. జగన్ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ జగన్ నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనపై విసిగి వేసారిన ప్రజలు ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నారు. ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. జగన్ రోడ్‌షోలో పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వేణుంబాక విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పార్థసారథి, పినిపే విశ్వరూప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. ముస్లిం యువకులను విడిపించండి.. రోడ్‌షో టూటౌన్ పోలీసు స్టేషన్ మీదుగా సాగుతున్నపుడు అక్కడ పెద్ద సంఖ్యలో ముస్లింలు గుమికూడి జగన్‌ను కలిశారు. తమ ప్రాంతంలో అధికార పార్టీ వారు డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు చేస్తే తమ పిల్లలనే (యువకులను) స్టేషన్లో నిర్బంధించారని వివరించారు. స్టేషన్లోకి వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఈ సమయంలో పోలీస్‌స్టేషన్‌లోకి రావడం మంచిది కాదని, సమస్యను జటిలం చేయకూడదని ఆయన వారికి నచ్చ జెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును పిలిచి.. పోలీసు అధికారులతో మాట్లాడి వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగన్ పర్యటన ముగిసిన వెంటనే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడి నిర్బంధంలో ఉన్న ముస్లిం యువకులను విడిపించారు. -
నీరాజనం
♦ జననేతకు కాకినాడ వాసుల బ్రహ్మరథం ♦ వెల్లువెత్తిన ప్రజాభిమానం ♦ వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో ఉరకలేసిన ఉత్సాహం జననేత కోసం జనకెరటం ఎగిసిపడింది. తరలివచ్చిన అశేష జనంతో కాకినాడ ఉప్పొంగిపోయింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం కాకినాడ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంతో కదం తొక్కాయి. అడుగడుగునా ప్రజలు కేరింతలు కొడుతూ అభిమాన నేతకు నీరాజనాలు పలికారు. కాకినాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు జేజేలు పలుకుతూ ‘మీ వెంటే మేము’న్నామంటూ భరోసానిస్తూ ఉత్సాహాన్ని నింపారు. 29న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో జగన్ పర్యటనను ఊహించినదానికన్నా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపింది. కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో నేరుగా కాకినాడలోని అన్నమఘాటీ సెంటర్‌కు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేరుకోగానే ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ కేడర్ బాణా సంచా కాలుస్తూ అపూర్వ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పాలనా చర్యలను ఎండగడుతూ ఆయన చేసిన ప్రసంగం కాకినాడ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. నాడు వైఎస్ అమలు చేసిన పథకాలు, ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేస్తున్న తీరును వివరిస్తూ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపచేసింది. పర్యటనలో భాగంగా ఆయన ఘాటీ సెంటర్ నుంచి చంద్రిక థియేటర్, ఎన్టీఆర్ వారధి మీదుగా టూటౌన్ పోలీస్‌స్టేషన్, సినిమా రోడ్డు నుంచి ఆయన పర్యటన కొనసాగింది. అనేకచోట్ల జగన్‌తో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు మహిళలు, యువత ఉత్సాహం చూపించారు. దారి పొడవునా పలకరింపులు... మార్గమధ్యలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ముస్లిం మహిళలు కూడా జగన్‌ను కలిసి సమస్యలు వివరించారు. ఎన్నికల్లో ఓట్ల పంపిణీపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే తిరిగి తమపై కేసులు పెడుతున్నారంటూ మరికొందరు జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు. జగన్‌తో సెల్ఫీలు దిగడానికి కొందరు ఆసక్తి చూపడం, వారిని ప్రోత్సహిస్తూ జగన్ సెల్ఫీలు దిగారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సినిమా రోడ్డు, సాంబమూర్తిప్లై ఓవర్ మీదుగా డైరీఫారం సెంటర్‌కు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సభావేదిక వద్దకు వచ్చిన వృద్ధులను, ఆత్మీయంగా పలుకరించి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఫ్యాన్‌గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఆయన వినమ్రంగా ఓటర్లను అభ్యర్థించారు. జగన్ పర్యటనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, జిల్లా పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పి.పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, కొప్పన మోహనరావు, పినిపే విశ్వరూప్, సినీనటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, సినీనటుడు విజయ్‌చందర్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ళనాని, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ము త్తా శశిధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరు కృష్ణం రాజు, పాముల రాజేశ్వరిదేవి, బొత్స అప్పలనర్సయ్య, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, గురునాధరెడ్డి, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, బొంతు రాజేశ్వరరావు, కొండేటిచిట్టిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ళ లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కం పూడి రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండుకుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, నక్కా రాజబాబు, చెల్లుబోయిన శ్రీను, జిల్లా యువజన, మహిళా, ఎస్సీ,ప్రచార, మైనార్టీ విభాగాల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, కొల్లి నిర్మలాకుమారి, పెట్టా శ్రీనివాస్, సిరిపురపు శ్రీనివాస్, అబ్దుల్ బషీరుద్దీన్, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘించి టీచర్లతో మంత్రి గంటా భేటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల వేళ ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘం నేతలు కాకినాడలో హడావుడి పర్యటనచేశారు. ఏపీ జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు ఓ వైపు, పీఆర్టీయూ నేత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మరోవైపు చాటుమాటు రాజకీయాలు నడిపారు. శనివారం రాత్రి అశోక్‌బాబు తన అనుయాయులను కలిసి ప్రభుత్వానికి మద్దతుగా సంప్రదింపులు చేయగా, ఆదివారం పీఆర్టీయూ నేతలతో గాదె సమావేశమై స్వామిభక్తిని చాటుకున్నారు. కాకపోతే, ఎన్నికల వేళ ఉపాధ్యాయులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం కావడం కాస్తా వివాదాస్పదంగా మారింది. ఏం జరిగిందంటే..: కాకినాడలో శనివారం రాత్రి ఎన్జీవో సంఘం సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు హాజరయ్యారు. ఎన్నికల వేళ అశోక్‌బాబు టీడీపీకి మద్దతు కూడగట్టేలా పరోక్షంగా పావులు కదిపారన్న అభిప్రాయం వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసిన పేరు అశోక్‌బాబుకు వెళ్లిపోతుందని పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయులతో నరసన్ననగర్లోని తిరుమల ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి, దానికి మంత్రి గంటాను ఆహ్వానించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. దీంట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉపాధ్యాయులతో మంత్రి గంటా , ఎంపీ పండుల రవీంద్రబాబు సమావేశం కావడం వివాదాస్పదమైంది. ఎన్నికల్లో సహకరించాలని పిలుపు: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, పది రోజుల్లో పరిష్కారమవుతాయని, కార్పొరేషన్ ఎన్నికల్లో సహకరించాలని మంత్రి గంటా సమావేశంలో విజ్ఞప్తిచేశారు. ప్రైవేటు సంస్థలు, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఒక సందర్భంలో హుకుం కూడా జారీచేశారు. ఈ విషయం బయటకు రావడంతో మిగతా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉపాధ్యాయ సంఘాలతో ఇలా సమావేశాలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమైంది. -
మీకు తోడుగా నేనుంటా: వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: తనను నమ్మి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కాకినాడ ప్రజలకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం నగరంలోని డెయిరీఫామ్ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలమయమని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన చూసి ఓటు వేయాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, చంద్రబాబు మోసాలకు గుణపాఠం చెప్పాలన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలకు నాంది అవుతాయని జగన్ అన్నారు. కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనకు వదిలేయాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ తాను తోడుగా ఉంటానని భరోసాయిచ్చారు. తాము అధికారంలోకి రాగానే 'నవరత్నాల' హమీలతో పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడతామని హామీయిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఈ ప్రభుత్వం మనకు వద్దు అనేలా చంద్రబాబు పాలన సాగుతోంది కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలవాలి ఏడాది తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారు, ఎన్నికల ముందు ఏం మాటలు చెప్పారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడం ధర్మమేనా? ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఆ మనిషిని నిలదీయకూడదట నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు నంద్యాలలో నడిరోడ్డు మీద టీడీపీ వాళ్లు తుపాకీతో కాల్పులు జరిపారు కాల్చినవాళ్ల మీదగానీ, కత్తులతో వీరంగం సృష్టించిన వాళ్లపై గానీ కేసులు పెట్టలేదు ఇలాంటి పాలనకు మనకు కావాలా అని అడుగుతున్నా కాపులు రిజర్వేషన్ల కోసం కంచాలు మోగిస్తే కేసులు పెట్టారు ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబుపై కేసులు ఉండవు తాను హీరోగా చూపించుకునేందుకు పుష్కరాల్లో 29 మందిని చంపేసినా కేసులు ఉండవు విశాఖ జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు మాయమైపోతున్నాయి ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మోసం చేసిన పాలన ఇది అధికారంలోకి వచ్చాక అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలన ఇది ప్రజలు ఇలాంటి పాలన వద్దే వద్దు అంటున్నారు చంద్రబాబు ఎన్నిలకప్పుడు ఏం చెప్పారు, ఎన్నిలయ్యాక ఏంచేశారు అనేది నంద్యాలలోనే చెప్పా సీఎం కావడం కోసం చంద్రబాబు ఎన్నో అబద్ధపు హామీలిచ్చారు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తానన్నారు అర్హులకు ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా? బాబు అధికారంలోకి వచ్చాక ఎంతమందికి జాబులొచ్చాయి? ప్రతి కుటుంబానికి చంద్రబాబు రూ. 78 వేల నిరుద్యోగ భృతి బాకీ పడ్డారు బాబు హైటెక్ పాలన వల్ల షాపుకు వెళ్లకుండానే ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు చంద్రబాబు పాలనతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నారా, లేదా? ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు బేషరతుగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.. ఏమైంది? ఎన్నికలకు ముందు రూ.200 ఉన్న కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.500 అయింది ఇంటిపన్ను రూ.500 నుంచి రూ. 1000కి పెరిగింది కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది? ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,108 పథకాలను నీరుగార్చారు మీకు తోడుగా నేను నిలబడతాను, ఫీజు రీయింబర్స్మెంట్ నేను ఇస్తాను దోమలపై దండయాత్ర అని ప్రకటించి కాకినాడలో కనీసం డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు డంపింగ్, డ్రైనేజీ లేకుంటే దోమలు రావా? కాకినాడలో బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్నారు.. ఏమైంది? వర్షం పడితో ఎన్ని ప్రాంతాలు మునుగుతాయో చంద్రబాబుకు తెలుసా? వస్తే కాకినాడలో 17 ప్రాంతాలు మునుగుతాయి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు మొదలు పెట్టారా? చాలా కాలనీలకు మంచినీరు కూడా రావడం లేదు సిటీ ఎమ్మెల్యే కొండ బాబు కబ్జాల బాబుగా మారారు శ్మశానాలు కూడా వదలకుండా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చేస్తానన్న ఏ ఒక్క వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేయలేదు చంద్రబాబు లంచాలు తీసుకుంటే పేదవాళ్లు డబ్బులు కట్టాలట జీవితంలో అబద్ధాలు చెప్పని వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు అయితే ఒక్క నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడాలి హామీలు అమలు చేయకుంటే నిలదీస్తారనే భయం నేతలకు రావాలి అందుకు కాకినాడ నాంది కావాలి, అప్పుడే వ్యవస్థ బాగు పడుతుంది కాకినాడ, నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి ఈ రెండింటినీ అన్నిరకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అధికారంలోకి వస్తే మత్స్యకారులకు సెలవు దినాల్లో రూ.5 వేలు ఇస్తాం ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ఇస్తాం మత్స్యకారుల పిల్లలను బడికి పంపాలి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.500 ఇస్తాం 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఒక్కొక్కరికీ 750 ఇస్తాం ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు ఇస్తాం ప్రతి కుటుంబంలో ఇద్దరికి డబ్బులు చెల్లించే బాధ్యత నాదే -
అచ్చం..నంద్యాల సీన్ రిపీట్!
- సర్వే ముసుగులో కాకినాడలో ప్రలోభాలు - డివిజన్‌కు ముగ్గురు చొప్పున ఇల్లిల్లూ తిరుగుతున్న వైనం - ఎవరికి అనుకూలమో తెలుసుకుని టీడీపీ నేతలకు చేరవేత - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు - మీరే కిడ్నాప్ చేశారని ఫిర్యాదు అందిందన్న పోలీసులు కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ పెద్దలు కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. వందలాది మందిని రంగంలోకి దింపి సర్వే పేరుతో ఎవరు అనుకూలురు.. ఎవరు వ్యతిరేకులు అనే విషయాన్ని సేకరించడం ఇందులో తొలి ఘట్టం. ఆ తర్వాత ప్రలోభాల పర్వం.. కాదు కూడదంటే బుజ్జగింపులు..ఆపై బెదిరింపులు. ఇలా సమాచారం చేర వేస్తున్న వారిని వైఎస్సార్సీపీ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. అచ్చంగా నంద్యాల సీనే రిపీట్ అయ్యింది. మీరే కిడ్నాప్ చేశారేమో అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. కాకినాడ 35వ డివిజన్లో శుక్రవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ‘ఏ రాజకీయ పార్టీ అభివృద్ధి చేయగలదని భావిస్తున్నారు? చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? జగన్ తీరుపై ఏమనుకుంటున్నారు? కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు?’ అంటూ ప్రశ్నలు వేస్తూ వారు టీడీపీకి అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయాన్ని గమనించి నోట్ చేసుకుంటున్నారు. చివరలో ఇంటి యజమాని ఫోన్, అకౌంట్ నంబర్‌ను కూడా తీసుకుంటున్నారనే సమాచారం తెలియడంతో అనుమానం వచ్చిన అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి బెండా విష్ణు అనుచరులతో కలసి వెళ్లి అశోక్, విజయ్‌భాస్కర్, విజయ్ అనే వ్యక్తులను పట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటి తర్వాత.. ముగ్గురు వ్యక్తులను మీరు కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు చెప్పేసరికి వైఎస్సార్సీపీ నేతలు నివ్వెరపోయారు. 150 మందితో సర్వే టీమ్ ఎన్నికల్లో సర్వే కోసం కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వచ్చామని వైఎస్సార్సీపీ నేతలకు పట్టుబడ్డ అశోక్, విజయభాస్కర్, విజయ్ చెప్పారు. డివిజన్‌కు ముగ్గురు చొప్పున 150 మంది వచ్చామని, వివిధ హోటళ్లలో ఉంటున్నామన్నారు. నాలుగు రోజులుగా ఈ సర్వే చేస్తున్నామని చెప్పారు. తమకు వసతి, భోజనం కల్పించి రోజుకు రూ.400 ఇస్తున్నారని, సర్వే వివరాలను ఆన్లైన్లో తమ సంస్థకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఏ సంస్థా సర్వే నిర్వహించకూడదు. ఇందుకు విరుద్ధంగా 150 మంది సర్వేలో పాల్గొనడం అనేక సందేహాలకు తావిస్తోంది. పైగా ప్రతి సర్వే సిబ్బంది వద్ద ట్యాబ్‌లు కూడా ఉన్నాయి. ఆ ట్యాబ్‌లలో ఓటర్ల లిస్టు నిక్షిప్తం చేసి మరీ ఇచ్చారు. సదరు ఇంటి యజమాని లేదా ఓటరు పేరు టైప్ చేయగానే ఓటరు అవునో కాదో కూడా అక్కడికక్కడే తెలిసిపోతోంది. మామూలుగా సర్వే చేసే వారి వద్ద ఇన్ని వివరాలు ఉండవు. పైగా అకౌంట్ నంబర్ అడగడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా సర్వే చేసే వారు ప్రతి ఇల్లూ తిరిగరనే విషయం తెలిసిందే. ఈ అనుమానాలతోనే వైఎస్సార్ సీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
కాకినాడ కోసమే కాకిలెక్కలు..
అధికారపార్టీ ఎత్తులకు అంతూదరీ లేదు.. - నిషేధం ఉన్నా ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా చేశారు? - సర్వేల పేరుతో దొంగ లెక్కల ప్రచారం - శ్రేణులను ఉత్సాహపరిచేందుకే గెలుపుపై లీకులు - కాకినాడ ఎన్నికలకు బాగా పనిచేస్తారనే.. - అయినా ఇన్ని పొంతనలేని లెక్కలు అవసరమా? - నంద్యాల సర్వేలపై విస్తుపోతున్న విశ్లేషకులు సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నంద్యాల ఎన్నికలలో విజయం ఎవరిదో బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఏ నిర్ణయం తీసుకున్నాడో 28న గానీ వెల్లడి కాదు. కానీ ఎగ్జిట్ పోల్స్ పేరిట, సర్వేల పేరిట రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని చానళ్లలోనూ, పత్రికలలోనూ, సోషల్‌మీడియాలోనూ ఒక పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకదానికొకటి పొంతన లేకుండా అనేక కాకిలెక్కలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉన్నా వాటిని ఎవరు నిర్వహించారు? అది ఎలా సాధ్యం? ఇక సర్వేల లెక్కలు ఒకదానితో ఒకటి పొంతన కుదరకపోవడాన్ని ఎలా చూడాలి? ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు? వీటన్నిటికీ ఒకటే సమాధానం.. నంద్యాల లెక్కలను చూసి శ్రేణులు కాకినాడ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలి.. అన్న లక్ష్యంతోనే అధికారపార్టీ ఈ కాకిలెక్కలను ప్రచారం చేస్తోందని విశ్లేషకులంటున్నారు. పొంతనలేని లెక్కలు.. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కోసమే అధికారపార్టీ నంద్యాల ఉప ఎన్నికల ఫలితంపై కాకిలెక్కల సర్వేల కట్టుకథలు అల్లుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నుంచి టీడీపీ నేతల్లో, శ్రేణుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటానికి, కాకినాడలో ప్రచారం కొనసాగించుకోవడానికి, ఓటర్లను నానా అడ్డదారుల్లో ప్రభావితం చేయడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతోందని అంటున్నారు.. అందులో భాగంగానే ఉప ఎన్నికల ఫలితంపై పూటకో మాట, రోజుకో లెక్క చొప్పున సర్వేల పేరిట ఊదరకొడుతూ విభిన్న రకాల లీకులు ఇప్పిస్తూ, అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటోందని విమర్శకులు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలలో ఏ ఒక్క దానికి సరైన పొంతన, వాస్తవ విశ్లేషణ లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.. చివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలీసు నిఘా యంత్రాంగం పేరిట లీకుల రూపంలో వస్తున్న సర్వేలు కూడా విభిన్నంగా ఉంటుండటం పరిశీలనాంశమని అంటున్నారు. కాకినాడ కోసమే ఈ కాకిలెక్కలు.. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్ల మద్దతును అంచనా వేసుకున్న చంద్రబాబు, ఆయన కోటరీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించుకుందని తెలిసింది. నంద్యాల ఎన్నికల్లో మనదే గెలుపు అన్నరీతిలో భారీ ప్రచారం చేయాలని, లేదంటే కాకినాడలో కనీసం ప్రచారానికి కూడా నాయకులు, శ్రేణులను వెతుక్కోవాల్సి వస్తుందనే భావన పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైందనేది వినికిడి. పైగా ఆ జిల్లాలో ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా అంచనా వేసింది. ఆదివారం సాయంత్రానికి కాకినాడ ప్రచారం ముగుస్తుందని, అప్పటి వరకు సర్వేల పేరిట లీకులిస్తూ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలనే నిర్ణయానికి వచ్చిందని, అందులో భాగంగానే విభిన్న సర్వేలంటూ ఒక వర్గం మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌ల్లో హల్చల్ చేయిస్తోంది. చంద్రబాబుకు వత్తాసుగా ఉంటున్న ఓ పత్రిక, ఛానెల్, మరో ఛానెల్ సర్వేలు చేయించిందనేది బహిరంగ రహస్యం. ఆ మీడియా ఏంచెప్పినా, ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించరని ప్రభుత్వాధినేతకు తెలుసు. దీన్ని నమ్మకమైన వ్యక్తి ద్వారా చెప్పించాలని చంద్రబాబు వ్యూహం పన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఎన్నికల సర్వేలు తనకు హాబీ అని, వాటిని చేయిస్తుంటానని లగడపాటి స్వయంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నిక సర్వే ఫలితాలు కూడా ఆయన ద్వారా వెల్లడింపజేస్తే ప్రజలు విశ్వసిస్తారని చంద్రబాబు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ‘నంద్యాల ఉప ఎన్నికలపై నేను సర్వే చేయించలేదు. కానీ సర్వేచేసిన టీం నాకు తెలుసు. వారు చెప్పిన విషయాలనే నేను మీడియాకు చెపుతున్నాను. టీడీపీకి అనుకూలంగా ఫలితం ఉంటుంది’ అని లగడపాటి మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. ఓటుకు దాదాపు రూ.5,000 తో పాటు చీరలు, ముక్కుపుడకలను పంపిణీ చేయించినా జనామోదం లభించలేదని ముఖ్యమంత్రి సభలకు హాజరైన జనాన్ని చూసి అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. మరోవైపు తన వద్ద డబ్బు లేదని, అధికారం లేదని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించే చానళ్లు పత్రికలు లేవని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాడవాడలా ఎలుగెత్తి చెప్పారని, అయినా ఆయన సభలకు జనం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారని, దీనిని బట్టే జనం ఎటువైపు ఉన్నారో అర్ధమౌతోందని వారు వాఖ్యానిస్తున్నారు. అయినా ఎగ్జిట్ పోల్స్, సర్వేల పేరుతో తప్పుడు లెక్కలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తేలికగానే అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ‘నంద్యాల ఫలితం వ్యతిరేకంగా రాబోతోందని తేలితే శ్రేణులు డీలా పడిపోతాయి. దానివల్ల కాకినాడ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే నంద్యాలలో మనం జయకేతనం ఎగురవేయబోతున్నామని ప్రచారం చేస్తే కాకినాడ కోసం ఉత్సాహంగా పనిచేస్తారు అందుకే ఇలా సర్వేలను జనంలోకి వదిలాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలుగుదేశం నాయకుడొకరు వ్యాఖ్యానించారు. సాధారణంగా ఏ ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీయే గెలుస్తుండడం సహజమే కాబట్టి తమ ప్రచారాన్ని ఎవరూ తప్పుబట్టలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే మరీ ఇన్ని కాకిలెక్కలు అవసరమా, రేపు ఫలితం కాస్త అటూ ఇటు అయితే ఏం చెబుతారని అడిగితే జనానికి అన్నీ గుర్తుండవని, ముందు కాకినాడలో గట్టెక్కేయడమే తమ నాయకుడి లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. -
'భుజాలు తడుముకున్న చంద్రబాబు'
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించగానే సీఎం చంద్రబాబు భుజాలు తడుముకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులను చిన్న చూపు చూసింది చంద్రబాబేనని విమర్శించారు. నంద్యాలలో అభివృద్ధి పేరుతో వ్యాపారుల షాపులను అంత్యంత దయనీయంగా ధ్వంసం చేశారని.. కాకినాడలో కూడా 45 దుఖాణాలు ధ్వంసం చేసి కేవలం 24 షాపులకు టీడీఎస్ ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మూడున్నర ఏళ్లుగా కాకినాడకు ఏమీ చేయలేని చంద్రబాబు.. రానున్న ఏడాదిన్నరలో ఏమి చేస్తారో ఓటర్లు ఆలోచించాలన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ధనబలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. బాబు పతనం కాకినాడ నుంచే ప్రారంభం టీడీపీ, చంద్రబాబు నాయుడు పతనం కాకినాడ నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలందరూ వైఎస్ జగన్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కాకినాడలో తిష్ట వేశారని చెప్పారు. సీఎం రెండు రోజులు కాకినాడలో ఉండటానికి వస్తున్నారంటే టీడీపీ ఎంత అభద్రతాభావంతో ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. -
మంత్రులు x క్యాడర్
- కాకినాడ అభ్యర్థుల ఎంపికలో మంత్రుల ఏకపక్ష వైఖరి - రెబెల్ అభ్యర్థులను నిలపడంపై బీజేపీ గుర్రు - ముద్రగడ దీక్ష నేపథ్యంలో కాపుల నుంచి అందని సహకారం - ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపట్ల వివిధ వర్గాల్లో వ్యతిరేకత కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతిక కారణాలు చూపించి ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఎన్నికలు నిలుపుదల చేసే అవకాశాలు లేవని బుధవారం హైకోర్టు తీర్పునివ్వడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఇక అభ్యర్థుల ఎంపికలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి కళావెంకట్రావులు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) అభిప్రాయాలకు ప్రాతినిథ్యం ఇవ్వలేదు. మేయరు అభ్యర్థిగా జ్యోతుల ఇందిరను మొదటి నుంచి ఎమ్మెల్యే వనమాడి ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా 40వ డివిజన్లో ఆమె ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే మంత్రి యనమల రామకృష్ణుడు వర్గానికి చెందిన సుంకర శివప్రసన్నకు (భర్త తిరుమలకుమార్) సీటు ఖరారు చేశారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన జ్యోతిల ఇందిరకు ఆ డివిజన్ కాకుండా మరో డివిజన్ కేటాయించడంతో ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కొండబాబుకు ముగ్గురు మంత్రులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికలో ఆ వర్గానికి 20 వేల వరకు ఓట్లున్నాయి. వారంతా తమ సామాజికవర్గ నాయకుడైన ఎమ్మెల్యే కొండబాబుకు ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచార కార్యక్రమంలో కూడా ఆయన అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. సీట్ల సర్దుబాటులో బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించి ఆ తరువాత మూడు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా రెబల్స్‌గా బరిలో నిలిచారు. దీనిపై బీజేపీ నేతలు స్థానిక టీడీపీ నేతల్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. మంత్రులను సంప్రదించేందుకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జి, విశాఖ రూరల్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రయత్నించినా వారెవరూ స్పందించకపోవడంతో ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చంటిబాబు రాజీనామాతో... పార్టీ ఆపద సమయంలో మెట్ట కేంద్రమైన జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌ను నిలబెట్టిన ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ జ్యోతుల చంటిబాబుకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా, అతనిపై పోటీ చేసిన వరసకు చిన్నాన్న అయిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ జ్యోతుల చంటిబాబు పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఓ వైపు ఎమ్మెల్యే కొండబాబు, మరో వైపు మెట్ట ప్రాంతానికి చెందిన చంటిబాబులకు జరిగిన పరాభవాలు ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇంత వరకూ కాకినాడ కార్పొరేషన్ మేయరు పీఠం ఆ పార్టీకి దక్కలేదు. గతంలో పార్టీకి మంచి ఊపున్నప్పుడే టీడీపీ మేయరు దక్కించుకోలేకపోయింది. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కాకినాడ కార్పొరేషన్‌ను ఏలుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ దఫా కూడా తమకు పరాభవం తప్పదనే భావంలోనే క్యాడర్ ఉంది. ఈ సెంటిమెంట్ భయం వారిని వెన్నాడుతోంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. కాపు సెగ.. దళితుల నిరసనలు.. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం కీలకంగా ఉంది. జిల్లాకు చెందిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా, 24 రోజులుగా గృహనిర్బంధంలో ఉంచడంపై ఆ సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. వీరు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డిలు దళితుల పట్ల వ్యవహరించిన తీరు ఆ సామాజిక వర్గంలో చర్చనీయాంశమైంది. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని గతంలో సీఎం వ్యాఖ్యలు చేయగా... ఎస్సీలు శుభ్రంగా ఉండరు.. చదువుకోరని తాజాగా మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నంద్యాలలో ఆయన అభిమానిపై చేసిన వీరంగం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో యువతలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. -
ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు షాక్
కాకినాడ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించిన చంద్రబాబు కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతల నుంచి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను సీఎం చంద్రబాబు తప్పించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 48 డివిజన్ల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బాబు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులెవరూ బరిలో లేరు. సీట్ల కేటాయింపులో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కిమిడి కళావెంకట్రావు ముఖ్య భూమిక వహించారు. కాకినాడలో చంద్రబాబు సామాజిక వర్గం ఓటర్లు తక్కువగా ఉండటంతో ఆ వర్గానికి సీటు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఎం సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత జరిగిన చర్చల్లో చినరాజప్ప సీఎం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కాకినాడ ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
కాకినాడలో పొత్తు ధర్మం పాటించట్లేదు
విష్ణుకుమార్‌రాజు విశాఖ సిటీ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పొత్తు ధర్మం పాటించట్లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. పొత్తు కుదరక ముందు 23 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, అయితే టీడీపీ పెద్దలతో కలసి సీట్ల పంపకాలపై చర్చలు జరిపాక కుదిరిన పొత్తు ఒప్పందం మేరకు తొమ్మిది స్థానాల్లోనే అభ్యర్థుల్ని ఉంచామని తెలిపారు. మిగిలిన 14 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించారని చెప్పారు. కానీ ఈ 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించకుండా పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. -
హామీ ఇచ్చి తప్పించుకుంటారా?
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలన్న ఉత్తర్వుల విషయంలో తప్పును తమపై తోసేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ తాము తప్పుగా ఉత్తర్వులు ఇచ్చి ఉంటే... ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చి, తప్పును సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కరికాళ వలవన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను నిలదీసింది. 2016 నవంబర్ నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చి, ఇప్పుడేమో జాప్యానికి బాధ్యులం మేం కాదంటూ తప్పించుకోవడం సరికాదని హితవు పలికింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశామని ఎన్నికల కమిషనర్ తరపు న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ... ఇరువురు అధికారులను కోర్టుకు పిలిపిస్తే తప్ప నోటిఫికేషన్ జారీ చేయరా? అని వ్యాఖ్యానించింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మూసివేసే ప్రసక్తే లేదని, తమ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారా? లేదా? అన్న విషయాన్ని తేలుస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.