
నీరాజనం
♦ జననేతకు కాకినాడ వాసుల బ్రహ్మరథం
♦ వెల్లువెత్తిన ప్రజాభిమానం
♦ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో ఉరకలేసిన ఉత్సాహం
జననేత కోసం జనకెరటం ఎగిసిపడింది. తరలివచ్చిన అశేష జనంతో కాకినాడ ఉప్పొంగిపోయింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం కాకినాడ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంతో కదం తొక్కాయి. అడుగడుగునా ప్రజలు కేరింతలు కొడుతూ అభిమాన నేతకు నీరాజనాలు పలికారు. కాకినాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు జేజేలు పలుకుతూ ‘మీ వెంటే మేము’న్నామంటూ భరోసానిస్తూ ఉత్సాహాన్ని నింపారు. 29న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో జగన్ పర్యటనను ఊహించినదానికన్నా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపింది.
కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో నేరుగా కాకినాడలోని అన్నమఘాటీ సెంటర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేరుకోగానే ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ కేడర్ బాణా సంచా కాలుస్తూ అపూర్వ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పాలనా చర్యలను ఎండగడుతూ ఆయన చేసిన ప్రసంగం కాకినాడ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. నాడు వైఎస్ అమలు చేసిన పథకాలు, ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేస్తున్న తీరును వివరిస్తూ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపచేసింది. పర్యటనలో భాగంగా ఆయన ఘాటీ సెంటర్ నుంచి చంద్రిక థియేటర్, ఎన్టీఆర్ వారధి మీదుగా టూటౌన్ పోలీస్‌స్టేషన్, సినిమా రోడ్డు నుంచి ఆయన పర్యటన కొనసాగింది. అనేకచోట్ల జగన్‌తో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు మహిళలు, యువత ఉత్సాహం చూపించారు.
దారి పొడవునా పలకరింపులు...
మార్గమధ్యలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ముస్లిం మహిళలు కూడా జగన్‌ను కలిసి సమస్యలు వివరించారు. ఎన్నికల్లో ఓట్ల పంపిణీపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే తిరిగి తమపై కేసులు పెడుతున్నారంటూ మరికొందరు జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు. జగన్‌తో సెల్ఫీలు దిగడానికి కొందరు ఆసక్తి చూపడం, వారిని ప్రోత్సహిస్తూ జగన్ సెల్ఫీలు దిగారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సినిమా రోడ్డు, సాంబమూర్తిప్‌లై ఓవర్ మీదుగా డైరీఫారం సెంటర్‌కు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సభావేదిక వద్దకు వచ్చిన వృద్ధులను, ఆత్మీయంగా పలుకరించి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఫ్యాన్‌గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఆయన వినమ్రంగా ఓటర్లను అభ్యర్థించారు.
జగన్ పర్యటనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, జిల్లా పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పి.పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, కొప్పన మోహనరావు, పినిపే విశ్వరూప్, సినీనటి, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, సినీనటుడు విజయ్‌చందర్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ళనాని, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ము త్తా శశిధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరు కృష్ణం రాజు, పాముల రాజేశ్వరిదేవి, బొత్స అప్పలనర్సయ్య, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, గురునాధరెడ్డి, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, బొంతు రాజేశ్వరరావు, కొండేటిచిట్టిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ళ లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కం పూడి రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండుకుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, నక్కా రాజబాబు, చెల్లుబోయిన శ్రీను, జిల్లా యువజన, మహిళా, ఎస్సీ,ప్రచార, మైనార్టీ విభాగాల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, కొల్లి నిర్మలాకుమారి, పెట్టా శ్రీనివాస్, సిరిపురపు శ్రీనివాస్, అబ్దుల్ బషీరుద్దీన్, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.