కర్నూలు: షార్ట్ సర్క్యూట్ కారణంగా పెట్రోల్ బంక్ లో మంటలు చెలరేగిన సంఘటన కర్నూలు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మాధవీనగర్ లో గల రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆఫీస్ లో ఆదివారం మధ్యాహ్నం షార్ట సర్క్యూట్ సంభవించింది.
అక్కడ చెలరేగిన మంటలు నిమిషాల్లోనే పెద్దవి కావడంతో ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.